Uttar Pradesh : కారు కొనేందుకు మూడు నెలల కొడుకును అమ్మేశారు

లగ్జరీ జీవితం కోసం వారు చేసిన పనిని మానవత్వం ఉన్న ప్రతొక్కరూ ఛీ అంటున్నారు. అమ్మమ్మ, తాతయ్యల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh : కారు కొనేందుకు మూడు నెలల కొడుకును అమ్మేశారు

Car

Updated On : May 14, 2021 / 10:17 PM IST

Couple Sells New Born : కొంతమంది మనుషులు మారిపోతున్నారు. వారి వ్యవహార శైలి..వారి నడక..మొత్తం మారిపోతున్నాయి. డబ్బుల కోసం ఎవరినీ వదలడం లేదు. కన్నవారిని సైతం చూడడం లేదు. అయితే..కన్న తల్లిదండ్రులు ఇలాంటి స్థాయికైనా దిగజారుతారా అనిపిస్తోంది. లగ్జరీ జీవితం కోసం వారు చేసిన పనిని మానవత్వం ఉన్న ప్రతొక్కరూ ఛీ అంటున్నారు. అమ్మమ్మ, తాతయ్యల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ తిర్వా కొత్వాలి పీఎస్ పరిధిలో దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మూడు నెలల క్రతం మగబిడ్డ జన్మించాడు. కొన్ని రోజులుగా వీరి జీవితం హాయిగానే సాగిపోయింది. అయితే..వీరి మనస్సుల్లో ఓ దుర్బుద్ది పుట్టింది. సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ముచ్చటపడ్డారు.

కానీ వారి వద్ద అంత డబ్బు లేదు. దీంతో సొంత కొడుకును అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. మూడు నెలల పసికందును ఓ వ్యాపారవేత్తకు లక్షన్నర రూపాయలకు అమ్మేశారు. కానీ శిశువు కనిపించకపోవడంతో..అమ్మమ్మ. తాతయ్యలకు అనుమానం వచ్చింది. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువు వ్యాపారవేత్త వద్దే ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Read More : Covid Symptoms in Children: పిల్లల్లో పెద్దల మాదిరిగా కరోనావైరస్ లక్షణాలు ఉండట్లేదట!