Covid 19 : 11సార్లు కరోనా టీకా తీసుకున్నా…

కరోనా టీకా వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని అందుకే తాను..11 సార్లు టీకా తీసుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది...

Covid 19 : 11సార్లు కరోనా టీకా తీసుకున్నా…

Corona

Updated On : January 5, 2022 / 8:45 AM IST

11 Vaccine Shots : కరోనా టీకా వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని అందుకే తాను..11 సార్లు టీకా తీసుకున్నట్లు ఓ వ్యక్తి చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ఏయే తేదీల్లో టీకా తీసుకున్నది ఓ పేపర్ పై రాసి పెట్టుకోవడం గమనార్హం. ఈ సంగతి స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Beijing : వింటర్ ఒలింపిక్స్ ఏర్పాట్లు..బబూల్‌‌లో వేలాది మంది

మాధేపురా జిల్లాకు చెందిన 84 ఏళ వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్ ఉదకిషన్ గంజ్ సబ్ డివిజన్ ఒరాయ్ గ్రామానికి చెందిన వారు. పోస్టల్ శాఖలో పని చేసి రిటైర్ మెంట్ తీసుకున్నారు. తొలి డోసు 2021, 13 ఫిబ్రవరి తీసుకోవడం జరిగిందని, 2021, డిసెంబర్ 11 డోసులు పొందినట్లు వెల్లడించారు. 12వ డోస్ తీసుకొనేందుకు..చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే..అక్కడ టీకాల కార్యక్రమం ముగిసిపోయిందన్నారు. దీంతో తాను 12వ డోస్ తీసుకలేకపోయినట్లు తెలిపారు.

Read More : Balakrishna : మాస్ డైరెక్టర్‌తో మరో సినిమా ఓకే చేసిన బాలయ్య

మరోవైపు…మహారాష్ట్రలో కరోనాతో పాటు ఒమిక్రాన్‌ కల్లోలం కొనసాగుతోంది. ముఖ్యంగా రాజధాని ముంబైపై ప్రతాపం చూపుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 18వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవ్వగా.. 10వేలకు పైగా కేసులు ఒక్క ముంబైలోనే రికార్డయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 650కి పైగా ఒమిక్రాన్‌ కేసులుండగా.. ఒక్క ముంబైలోనే 4వందలకు పైగా నమోదయ్యాయి. ఆ తర్వాత పుణెలో 70కి పైగా ఒమిక్రాన్‌ కేసులున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా కేసులు సునామీలా వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ అన్నారు. థర్డ్‌వేవ్‌కు సిద్ధంగానే ఉన్నామనీ.. లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లు, ఆస్పత్రులలో 30వేల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. జంబో కొవిడ్‌ సెంటర్లు కూడా సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.