భారీ కరోనా సాయం ప్రకటించిన ఓలా కంపెనీ

  • Published By: vamsi ,Published On : April 10, 2020 / 11:32 AM IST
భారీ కరోనా సాయం ప్రకటించిన ఓలా కంపెనీ

Updated On : April 10, 2020 / 11:32 AM IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా.. పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ 5 కోట్లు విరాళం అందించింది ఓలా కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర సాయంగా పలు  సంస్ధలు, వ్యక్తులు తోచిన సాయం అందిస్తూ సంఘీభావం ప్రకటిస్తుండగా.. ఈ క్రమంలోనే ప్రముఖ టాక్సీ కంపెనీ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది

కోవిడ్‌-19పై పోరుకు తమ వంతు సాయంగా ఓలా గ్రూప్‌ గురువారం పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ 5 కోట్లు విరాళం అందజేసింది. అలాగే పలు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు సైతం కంపెనీ రూ 3 కోట్ల విరాళం ప్రకటించింది.

పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ. 5 కోట్లు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ 3 కోట్లు విరాళం అందచేస్తున్నామని ఓలా గ్రూప్‌ సహ వ్యవస్ధాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Also Read | తమిళనాడు పోలీసుల నిర్వాకం.. కర్ణాటకకు వెళ్లి లాక్ డౌన్ ఉల్లంఘించారంటూ హోం మంత్రిని ఆపేశారు