Second Wave Of COVID : కరోనా టైం.. పిల్లలు భద్రం సుమా

Second Wave Of COVID : కరోనా టైం.. పిల్లలు భద్రం సుమా

Corona Time

Covid-19 Affecting Children : ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా విరుచుకపడుతోంది. రెండో దశ తీవ్రంగా విజృంభిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా యువతపై వైరస్ బారిన పడుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఇక పిల్లల విషయానికి వస్తే..వీరిలో కూడా వైరస్ వేగంగా విస్తరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో పిల్లలే కరోనా వారియర్స్ గా మారుతున్నారని అంటున్నారు.

పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు ప్రస్తుతం స్కూళ్లు లేకపోవడంతో ఎక్కువగా ఆటలు, సెల్ ఫోన్, టీవీలను చూస్తూ కాలం గడిపేస్తున్నా..వీరిని గమనించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఆరు బయటకు వెళ్లిన సమయంలో..శుభ్రత గురించి మరిచిపోతారని, నేతలను చేతులతో తాకడం, చేతులను కండ్లు, ముక్కు, నోరులను ముట్టుకోవడం తెలియకుండానే చేస్తారని, దీనివల్ల కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రోజంతా ఇంట్లోనే ఉండడం మూలంగా..వీరి అల్లరి భరించడం కష్టతరమే..కానీ ఓపికగా అన్నీ భరించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

ఏమి చేయాలి ?

* పిల్లలను అవసరమైతే తప్ప బయటకు పంపకపోవడమే మంచింది.
* చెస్, క్యారమ్ తదితర గేమ్స్ ఆడుతూ ఇంట్లోనే గడిపే విధంగా చూసుకోవాలి.
* చేతులు శానిటైజ్ చేసుకోవడం, తప్పకుండా మాస్క్ ధరించే విధంగా చూడాలి.

* బయటి ఫుడ్ కు బై చెప్పడమే మేలు. ఇంట్లోనే చక్కటి పోషకాహారం అందివ్వాలి.
* జ్వరం, దగ్గు, జలుబు వస్తే..వెంటనే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం.
* పాఠ్య పుస్తకాలు, ఇతర విజ్ఞానదాయకమైన పుస్తకాలను అందించాలి.
* టీవీలు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లకు దూరంగా ఉండేవిధంగా చూడాలి.

Read More : Lord Hanuman : హనుమంతుడు హంపీలో జన్మించాడు..రుజువు చేస్తామంటున్న కర్నాటక