Lord Hanuman : హనుమంతుడు హంపీలో జన్మించాడు..రుజువు చేస్తామంటున్న కర్నాటక
ఆంజనేయుడి జన్మస్థలంపై మరోసారి వివాదం మొదలైంది. తమవాడంటే తమవాడని కర్నాటక, ఏపీ రాష్ట్రాలు ప్రకటించుకుంటున్నాయి.

Hanuma
Karnataka Wants ASI Survey : ఆంజనేయుడి జన్మస్థలంపై మరోసారి వివాదం మొదలైంది. తమవాడంటే తమవాడని కర్నాటక, ఏపీ రాష్ట్రాలు ప్రకటించుకుంటున్నాయి. తాజాగా ఆంజనేయుడు ఆంధ్రావాడేనన్న టీటీడీ ప్రకటనను కర్నాటక తోసిపుచ్చింది. హనుమ హంపీలోనే జన్మించాడని చెప్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో ఏఎస్‌ఐ ద్వారా సర్వే చేయిస్తామన్నారు కర్నాటక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈశ్వరప్ప. ఆధారాలతో సహా హనుమ తమ ప్రాంతంలో జన్మించాడని రుజువు చేస్తామంటున్నారు.
కర్నాటకలోని హంపీకి సమీపంలో ఆంజనేయనాద్రి కొండపై హనుమ జన్మించాడని కర్నాటక ప్రభుత్వం చెప్తోంది. రామాయణం గ్రంథంలో ఇది స్పష్టంగా లిఖించబడి ఉందంటున్నారు. రామలక్ష్మణులు ఆంజనేయనాద్రిపైనే హనుమను కలిశారని పురాణాల్లో ఉందంటున్నారు. హనుమంతుడు ఆంధ్రాలో జన్మించాడని ఏ ఆధారాలతో టీటీడీ ప్రకటించిందో తనకు తెలీదన్నారు కర్నాటక మంత్రి శ్రీనివాస పూజరీ.
రామాయణం గ్రంథం ఆధారంగా ఆంజనేయనాద్రి హనుమ జన్మస్థలం అని స్పష్టమవుతుందన్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వాగ్వాదం ఏమి లేదని…ఓ సర్వే చేయించి తమ ప్రాంతం వాడని నిరూపిస్తామంటున్నారు. మరోవైపు వాల్మికి రామయణంలో కర్నాటకలోని కుడ్లీ బిచ్ తీర ప్రాంతం గోకర్నలో ఆంజనేయుడు జన్మించాడని ఉందంటున్నారు రామచంద్రపుర మఠాధిపతి రాఘవేశ్వర భారతీ. వాల్మికీ రామాయణం ఆధారంగా హనుమ గోకర్ణలో పుట్టాడని, ఆంజనేయనాద్రి, కిష్కింద కర్మ భూమిగా నమ్ముతున్నామని అన్నారు.
Read More : Gujarat Man : ఫేక్ శానిటైజర్..10 నెలల్లో రూ.10 కోట్లు విక్రయాలు, చివరకు