India Covid – 19 : భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం రెండు లక్షల పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి.

India Covid – 19 : భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు

India

Updated On : May 23, 2021 / 10:59 AM IST

COVID-19 Daily Cases : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం రెండు లక్షల పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కానీ..మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 3 నుంచి 4వేల మరణాలు సంభవిస్తున్నాయి దేశంలో. గడిచిన 24 గంటల్లో 2, 40, 842 కేసులు నమోదయ్యాయి.

మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. రోజుకు 4వేల మంది చనిపోతే..తాజాగా..3 వేల 741 ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 28, 05, 399 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో కరోనాతో 2,99,266 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా..కరోనా రికవరీ రేటు 87.76 శాతంగా ఉంది. భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తొలిసారి 21,23,782 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశంలో 32.86 కోట్ల కరోనా టెస్టులు నిర్వహించారు.

Read More : Covid Vaccination : ఉద్యోగుల కుటుంబాలకు టీకాలు, రాష్ట్రాలకు కేంద్రం సూచనలు