ఇండియా షట్ డౌన్ : రైళ్లు,విమానాలు రద్దు… సరిహద్దులు మూసివేత..పెద్దలు బయటకు రావొద్దని సూచన

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2020 / 12:36 PM IST
ఇండియా షట్ డౌన్ : రైళ్లు,విమానాలు రద్దు… సరిహద్దులు మూసివేత..పెద్దలు బయటకు రావొద్దని సూచన

Updated On : March 19, 2020 / 12:36 PM IST

కరోనా నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వారం రోజులు అంతర్జాతీయ సరిహద్దులను కూడా మూసేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని కేంద్రం సూచించింది.

కరోనా వైరస్ దృష్ట్యా 10సంవత్సరాల లోపు చిన్నారులు, 65ఏళ్లు దాటిన పెద్దలు అందరూ ఇళ్లు వదిలి రావొద్దని కేంద్రప్రభుత్వం సూచించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది.అయితే భారత్ లో ఇప్పటివరకు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకడం)లేదని కేంద్రఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ అగర్వాల్ తెలిపారు.

ఇప్పటికే దాదాపు భారత్ షట్ డౌన్ అయింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించబడ్డాయి. వైరస్ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకే ప్రమాదం ఉన్నందును ప్రజలు ఎక్కువగా ఒక చోట చేరకుంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూల్స్,కాలేజీలు,సినిమా థియేటర్లు,మాల్స్ అన్నింటినీ మూసివేశారు. 

దేశ ప్రజల్లో కరోనా వైరస్ గురించి తీవ్ర భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇవాళ రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 170దాటింది. దేశంలో ఇప్పటివరకు నాలుగు కరోనా మరణాలు సంభవించాయి. అయితే మరణించిన ఈ నలుగురు విదేశాల నుంచి భారత్ కు తిరిగొచ్చిన వృద్ధులే.