Cow Climbed Third Floor: అయ్యో పాపం.. కుక్కల నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు ఎక్కేసిన ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
కుక్కలు తరమడంతో భయపడిపోయిన ఆవు.. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ బిల్డింగ్ లోకి దూరింది.

Cow Climbed Third Floor: పుణెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ జెర్సీ ఆవు ఏకంగా ఓ భవనంలోని మూడో అంతస్తు ఎక్కేసింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చివరికి ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి ఆవుని కాపాడారు. దాన్ని సేఫ్ గా కిందకు తీసుకొచ్చారు.
అది పుణెలోని వాదా భవనం. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా అలజడి రేగింది. కుక్కల అరుపులు వినిపించాయి. ఏంటా అని బయటకు వచ్చి చూడగా.. అంతా షాక్ కి గురయ్యారు. ఓ ఆవు ఆ భవనంలోకి వచ్చేసింది. చెక్కతో చేసిన మెట్లపై పరుగులు పెట్టింది. అలా మూడో అంతస్తులోకి వెళ్లిపోయింది.
కుక్కలు తరమడంతో భయపడిపోయిన ఆవు.. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ బిల్డింగ్ లోకి దూరింది. మరో దారి కనిపించడం మెట్లపైకి ఎక్కింది. అంతే మెట్లపై పరిగెడుతూ వెళ్లింది. అలా మూడో అంతస్తులోకి చేరింది. ఉదయం 6 గంటల సమయంలో పరదేశీ వాదాలో ఈ ఘటన జరిగింది. ఆవును చూసిన స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు.
Also Read: ట్రంప్ పర్యటనలో అమ్మాయిలు జుట్టు ఊపుతూ ఇలా ఎందుకు డ్యాన్స్ చేశారు?
ఆవుని కిందకు దించేందుకు వారు చాలా ప్రయత్నం చేశారు. ఎంతో కష్టపడ్డారు. అయితే, అవి చెక్కతో చేసిన మెట్లు కావడంతో ఆవుని కిందకు దించడం వారి వల్ల కాలేదు. ఇక లాభం లేదనుకుని ఫైర్ బ్రిగేడ్ కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది రంగంలోకి దిగింది. ఆవుకి బెల్టులు కట్టి, క్రేన్ సాయంతో జెర్సీ ఆవుని సురక్షితంగా కిందకు దించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.