అయోధ్యలో ఆవులకు చలికోట్లు

అయోధ్యలో ఆవులకు చలికోట్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఆవులకు పత్తితో తయారుచేసిన కోట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. అయోధ్య నగర్ నిగమ్ కమిషనర్ నీరజ్ శుక్లా మాట్లాడుతూ.. ‘ఆవుల కోసం చలికోట్లు తయారుచేయిస్తున్నాం. ఈ కార్యక్రమం మూడు నాలుగు దశల్లో జరగనుంది. బైషింగ్‌పూర్ ఆవుల షెడ్ నుంచి మొదలుపెట్టనున్నాం. 1200పశువులకు కోట్లు పంపిణీ చేస్తాం’
‘ఇందులో భాగంగానే ముందుగా 100కోట్లను ఆవు దూడలకు ఇస్తాం’ అని తెలిపారు. రూ.250నుంచి 300విలువ చేసే కోట్ మూడు లేయర్ గా కుట్టిస్తున్నారు. ఆవులకు, ఎద్దులకు వేర్వేరు డిజైన్ల కోట్లు ఇవ్వనున్నారు. చలికి తట్టుకునే విధంగా కోట్లు ఇవ్వడంతో పాటు షెడ్ లను కూడా పునర్మించనున్నట్లు వెల్లడించారు.
నగర మేయర్, కమిషనర్ లు మాట్లాడుతూ.. చలికి తట్టుకోవాలని కోట్లతో పాటు, షెడ్ లను కూడా బాగుచేస్తామని తెలిపారు. మా దృష్టి ఆవులను పరిరక్షించడమే. ఆవుల షెడ్‌లు బాగు చేసి రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.