Kerala Cabinet Shailaja : శైలజను రెండోసారి కేబినెట్ లోకి అందుకే తీసుకోలేదు : సీతారాం ఏచూరి

మాజీ మంత్రి కేకే శైలజకు పినరయి విజయన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. కేరళ సీఎంగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి సీతారాం ఏచూరి హాజరయ్యారైన సందర్భంగా మాజీ ఆరోగ్య శాఖా మంత్రి కేకే శైలజకు రెండో సారి కేబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదో వివరణ ఇచ్చారు.

Kerala Cabinet Shailaja : శైలజను రెండోసారి కేబినెట్ లోకి అందుకే తీసుకోలేదు : సీతారాం ఏచూరి

Cpm National Sec Sitaram (1)

Updated On : May 21, 2021 / 3:08 PM IST

Kerala New Cabinet KK Shailaja : మాజీ మంత్రి కేకే శైలజకు పినరయి విజయన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. గురువారం (మే 20,2021) కేరళ సీఎంగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో మహమ్మారికి కట్టడికి ఎంతగానో కృషి మాజీ ఆరోగ్య శాఖా మంత్రి కేకే శైలజకు రెండో సారి కేబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదో వివరణ ఇచ్చారు సీతారాం ఏచూరి.



రాష్ట్రం.. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కేబినెట్‌లోకి కొత్త వారిని తీసుకున్నారని..ఎమ్మెల్యే టికెట్ ఎవరికివ్వాలి? మంత్రిగా ఎవరిని తీసుకోవాలి? అనేది పూర్తిగా ఆయా రాష్ట్రాల కమిటీ చేతుల్లో ఉంటుందని తెలిపారు. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని వెల్లడించారు. మరోవైపు, కరోనా తొలి దశను అడ్డుకోవడంలో చక్కటి పనితీరు కనబరిచిన కేకే శైలజను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమం జరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.

కాగా..తనను రెండోసారి కేబినెట్ లోకి తీసుకోకపోవటంపై మాజీ మంత్రి శైలజ కూడా స్పందించారు. తనను కేబినెట్ లోకి తీసుకోవటం..తీసుకోకపోవటం పూర్తిగా పార్టీ నిర్ణయమనీ..పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా మేం సంతోషంగా అమలు చేస్తామని సీపీఎం పార్టీలో పదవుల కోసం పనిచేసేవారు లేరని..పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయటమే కార్యకర్తల పని అని..కొత్తవాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వటంలో సీపీఎం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని స్పష్టంచేశారు.



రెండో సారి అధికారంలోకి రావటం చాలా సంతోషంగా ఉందని..కొత్తవాళ్లను కేబినెట్ లోకి తీసుకోవటమనేది చాలా మంచి విషయమని అన్నారు. ఇది తన ఒక్కరికే కాదనీ..గత కేబినెట్ లో ఉన్నవారికి ఎవ్వరికీ కూడా రెండోసారి కేబినెట్ లోకి తీసుకోదని ఈ సందర్భంగా శైలజ గుర్తు చేశారు.పార్టీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని నేను ఆహ్వానిస్తున్నానని స్పష్టంచేశారు.

మా పార్టీలో అనేకమంది కార్యకర్తలు ఉణ్నారు. వారికి అవకాశం వస్తే కష్టపడి పనిచేస్తారు. అది కేవలం పదవుల కోసం కాదు..అటువంటి కార్యకర్తలు మా పార్టీలో ఉండరు. కష్టపడి పనిచేయటమే వారిపని. గత ఐదేళ్లలో మంత్రిగా సహచరులతో కలిసి పనిచేయటం చాలా సంతోషంగా ఉ:దని..కరోనా, నిషా వంటి కఠినమైన పరిస్థితులను సవాళ్లను.. ఎదుర్కొని తామంతా సమిష్టిగా పనిచేసామని తెలిపారు.



కాగా కేకే శైలజ మంచి పేరొందిన టీచర్.కేరళ ఆరోగ్యశాఖా మంత్రిగా నిఫా వైరస్,కరోనా వైరస్ వంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొని ప్రజల కోసం తీవ్ర కృషి చేశారు. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో సమర్థవంతంగా పనిచేసిన శైలజ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. యూకేకు చెందిన ఓ మ్యాజైన్ ఆమెను ‘‘టాప్ థింకర్ ఆఫ్ ద ఇయర్’’ గా కూడా ఎంపిక చేయటం ఆమె కృషికి నిదర్శం. ఇటీవల కేరళలో జరిగిన ఎన్నికల్లో ఆమె మట్టన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 61.97 శాతం ఓట్లతో గెలుపొందారు. ఈ క్రమంలో కేరళలో రెండోసారి అధికారంలోకి వచ్చిన సీపీఎం పార్టీ రెండోసారి కూడా పినరాయి విజయన్ నే సీఎంగా నిర్ణయించిది. దీంతో ఆమయన గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన కేబినెట్ లో అందరినీ కొత్తవారినే తీసుకోవటం సీపీఎం పార్టీ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పుకోకతప్పదు.