UP : ఎస్ఐ ఎగ్జామ్ కోసం వచ్చాడు..హైటెక్ కాపీయింగ్, వీడియో వైరల్
ఎస్ఐ పరీక్షల్లో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు. చీటింగ్ కోసం టెక్నాలజీని ఎంతో తెలివిగా వాడాడు. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు.

Up Si Exam
Uttar Pradesh’s SI Exam : పరీక్షలు అంటే కొందరికి భయం. ఏ ప్రశ్నలు వస్తాయోననే టెన్షన్ పడుతుంటారు. ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేశ్యంతో వక్రమార్గం ఎంచుకుంటుంటారు. కాపీలు కొట్టడానికి కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటుంటారు. తీరా…అధికారుల తనిఖీల్లో వారు పట్టుబడుతూ…భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు కొందరు. కాపీలు కొట్టడంలో స్టైల్ మారిపోయింది. హై టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా..ఎస్ఐ పరీక్షల్లో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు. చీటింగ్ కోసం టెక్నాలజీని ఎంతో తెలివిగా వాడాడు. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Read More : Kandi Farming: గిరిజన గూడాల్లో సిరులు కురిపిస్తున్న కందిసాగు
యూపీలో మెయిన్ సబ్ ఇన్స్ పెక్టర్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లు తీసుకుని పరీక్షా కేంద్రంలోకి వెళుతున్నారు. అక్కడున్న సెక్యూర్టీ అందరినీ చెక్ చేస్తూ పంపిస్తున్నారు. ఓ యువకుడిని కూడా అందరిలాగే చెక్ చేశారు. అయితే..డిటెక్టర్ తల వద్దకు రాగానే బీప్..బీప్ అనే శబ్ధం వచ్చింది. ఎందుకో డౌట్ వచ్చింది. ఏ మూలన కూర్చొబెట్టారు. అతని జుట్టును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అది విగ్ అని తేలింది. మెల్లిగా దానికి తీశారు. అందులో ఉన్నది చూసి షాక్ తిన్నారు. ఓ సిమ్, బ్యాటరీతో పాటు కొన్ని వైర్లు కనిపించాయి.
Read More : Made in Telangana: ఆన్‌లైన్‌లో మేడ్ ఇన్ తెలంగాణ ప్రొడక్ట్స్
చెవి దగ్గరకు ఉండేలా చాలా జాగ్రత్తగా సెట్ చేసుకున్నాడు. అతి చిన్న ఇయర్ ఫోన్లను రెండు చెవులకు పెట్టుకున్నాడు. మాములుగా చూస్తే..అస్సలు గుర్తు పట్టలేరు. Rupin Sharma IPS (@rupin1992) అనే వ్యక్తి…ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీడియోను షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఏం తెలివిరా బాబు..అని, ఇలాంటి వాళ్లు ఎస్ఐ అయితే..అంతే సంగతులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#UttarPradesh mein Sub-Inspector
की EXAM mein #CHEATING #nakal के शानदार जुगाड़ ☺️☺️???@ipsvijrk @ipskabra @arunbothra@renukamishra67@Uppolice well done pic.twitter.com/t8BbW8gBry— Rupin Sharma IPS (@rupin1992) December 21, 2021