భార్యపై అత్యాచారం చేయడానికి, ఫ్రెండ్‌కి పదివేలు బేరంపెట్టాడు

  • Published By: murthy ,Published On : October 2, 2020 / 10:26 PM IST
భార్యపై అత్యాచారం చేయడానికి, ఫ్రెండ్‌కి పదివేలు బేరంపెట్టాడు

Updated On : October 3, 2020 / 6:28 AM IST

Crime News:డెహ్రడూన్ పోలీసులకు ఓ చిత్రమైన కేసు వచ్చింది. నన్ను rape చేయడానికి నా భర్త, అతని ఫ్రెండ్ కి అనుమతి ఇచ్చాడు. ఇందుకోసం మా ఆయన వాళ్ల ప్రెండ్ దగ్గర 10వేలు తీసుకున్నాడని 22 ఏళ్ల భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగింది సెప్టెంబర్ 22న. అఘాయిత్యానికి పాల్పడినవాడు పరారీలో ఉన్నాడు. భర్తను పట్టుకున్నారు పోలీసులు. భార్య పోలీసు కేసు పెట్టటంతో ఈ అఘాయిత్యం వెలుగు చూసింది.

డెహ్రాడూన్ లోని ఒక మహిళ భర్త రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. భర్త తాగి రావటంతో ఆమె అభ్యంతరం చెప్పేది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగేది. సెప్టెంబర్ 22 న ప్రతిరోజూ లాగానే భర్త తాగి ఇంటికి వచ్చాడు. కానీ ఆరోజు తన ఫ్రెండ్ ను ఇంటికి తీసుకు వచ్చాడు. భర్త ఒళ్లు తెలియకుండా తాగిన మత్తులో ఉంటే అతని ప్రెండ్ ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించటం మొదలెట్టాడు.


ఆమె ఎదిరించింది. అయినా అతను ఆమెపై అనుచితంగా ప్రవర్తించటం మొదలెట్టాడు. భరించలేని మహిళ పూర్తి స్దాయిలో అతడ్ని ఎదుర్కోంది. దీంతో అసలు విషయం బయట పెట్టాడు. ఆమెను రేప్ చేయటానికి భర్తకు 10 వేలు రూపాయలు ఇచ్చినట్లు భర్త స్నేహితుడు చెప్పటంతో షాక్ కు గురైంది.


అతడి బారి నుంచి బయట పడిన మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేయటంతో రుద్రప్రయాగ్ జిల్లా ఎస్పీ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. మహిళపై అత్యాచారం చేయబోయిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఐపీసీ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేసి, నిందుతుడి కోసం గాలిస్తున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ భర్తను పట్టుకొని కేసు పెట్టి, జైల్లో పెట్టారు.