డబ్బుల్లేవంట: CRPF జవాన్లకు నో రేషన్

సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాలకు జీతాలతో పాటుగా రేషన్ ఇవ్వలేకపోతున్నామని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక సమస్యల కారణంగా సీఆర్పీఎఫ్ జవాన్లకు కేటాయించాల్సిన రూ.800కోట్లను ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. రేషన్ కోసం పలు మార్లు లెటర్ల ద్వారా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది.
సెప్టెంబర్ 13న దేశ వ్యాప్తంగా ఉన్న జవాన్లకు రేషన్ అందించలేకపోతున్నామంటూ సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి సందేశం వచ్చింది. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్‌కు సరిపడ రేషన్ మొత్తాన్ని ఇవ్వలేకపోతున్నాం’ అని ఉంది. వీటిపై స్పందించిన ఓ సీనియర్ అధికారి రేషన్ ఎల్లోవెన్స్ ఆపేయడం ఇదే తొలిసారి’ అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అధికారులతో మాట్లాడామని త్వరలోనే నిధులు వస్తాయని ఆశిస్తున్నట్లు టెలిగ్రాఫ్ మీడియాకు చెప్పారు.
మరో ఇంగ్లీష్ మీడియా అయిన ఎన్డీటీవీ కథనం ఇలా ఉంది. ‘సీఆర్పీఎఫ్ జవాన్లు డబ్బుల్లేకుండా గడుపుతున్నారనే మాటల్లో నిజం లేదని సంబంధింత అధికారులు వెల్లడించారు. ‘రేషన్ మనీ నెలకు రావాల్సిన రూ.3వేల 600వస్తాయి. త్వరలోనే ఆ డబ్బులు జవాన్లకు అందజేస్తాం. జవాన్లు డబ్బుల్లేకుండా గడుపుతున్నారనేది అవాస్తవం. ఆధారాలు లేకుండా ఆరోపణలు గుప్పిస్తున్నారని అధికారులు చెప్పారు’ అని ఆ మీడియా కథనంలో వివరించింది.