Cyclone Tauktae : గుజరాత్‌కు పొంచివున్న తుఫాన్ ముప్పు
అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం పక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని తెలిపింది.

Cyclone Tauktae May Hit Gujarat Coast On May 18 19, Imd Issues Alert
Cyclone Tauktae : అరేబియా సముద్రంలో భీకర తుఫాన్ ఏర్పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. దేశంలోని పశ్చిమతీరం నుంచి తుఫాన్ ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం పక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని తెలిపింది.
ఏల్లుండి నాటికి తుఫాన్ క్రమంగా తీవ్రమవుతుందని వార్నింగ్ ఇచ్చింది. తుపాను ప్రభావం గుజరాత్‌పై ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మే 18నాటికి గుజరాత్ దగ్గరే ఈ తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.
ఇక ఏడాది ఏర్పడే తొలి తుపాను ఇదే. దీనికి మయన్మార్ సూచించిన తౌకతీ అని పేరు పెట్టారు. తౌకతీ ప్రభావంతో మాల్దీవుల్లోని లక్షద్వీప్ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60
కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
లక్షద్వీప్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే ప్రమాదం కూడా ఉన్నట్లు వెల్లడించింది. తౌకతీ ప్రభావంతో కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.