Delhi : ఢిల్లీలో పేలుడు కలకలం, 13 మందికి గాయాలు!
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం.

Delhi Blast
Cylinder Blast : దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం.
ఢిల్లీలోని మంగోల్ పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి సమీపంలో 2021, జూన్ 20వ తేదీ ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ ఇంజిన్ వారికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గ్యాస్ లీకేజీ కారణంగానే..పేలుడు జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలో 13 మందికి గాయాలైనట్లు, వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు. ఆస్తినష్టం ఎంత వాటిల్లిందో..తదితర వివరాలు తెలియాల్సి ఉంది.