Uttar Pradesh: చెట్టు నరికివేతపై అభ్యంతరం.. దళిత వ్యక్తి జననాంగాలు కోసేసి, గర్భిణీ భార్యపై దాడి
తన భూమిలో ఉన్న బాబూల్ చెట్టును నరికివేయడాన్ని అభ్యంతరం చెప్పినందుకు, ఆధిపత్య వర్గానికి చెందిన వ్యక్తులు తనను దుర్భాషలాడారని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు తనను దారుణంగా కొట్టారని తెలిపాడు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. రాష్ట్రంలోని ఈటావా జిల్లాలో 32 ఏళ్ల దళిత వ్యక్తి జననాంగాలను కోశారు ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు. అంతటితో ఆగకుండా గర్భంతో ఉన్న ఆ వ్యక్తి భార్యను బూతులు తిడుతూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. కారణం, బాబూల్ చెట్టును నరుకుతుంటే అభ్యంతరం చెప్పినందుకు. పైగా ఆ చెట్టు బాధితుడిదే. ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకున్న ఈటావా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఈటావా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. బాధితుడి ప్రైవేట్ పార్ట్‌లో కోత పడిందని, చర్మం లోతుగా గాయమైందని తెలిపారు. బాధితుడు సతేంద్ర కుమార్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన గర్భిణీ భార్యపై నిందితులు దాడి చేశారని పేర్కొన్నాడు. విక్రమ్ సింగ్, సతేంద్ర అలియాస్ భురాయ్ ఠాకూర్ అనే ఇద్దరు నిందితులు బాధితుడిని, అతడి భార్యను బెదిరించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన జూన్ 14న జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
Viral Video: గ్రాడ్యుయేషన్ పాసైన ఆనందంతో డాన్స్ చేసింది.. అదే ఆమె కొంప ముంచింది
ఈ దాడి గురించి బాధితుడు మాట్లాడుతూ, తన భూమిలో ఉన్న బాబూల్ చెట్టును నరికివేయడాన్ని అభ్యంతరం చెప్పినందుకు, ఆధిపత్య వర్గానికి చెందిన వ్యక్తులు తనను దుర్భాషలాడారని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు తనను దారుణంగా కొట్టారని తెలిపాడు. నిందితులలో ఒకరైన విక్రమ్ వద్ద కత్తి ఉందని, దానితో తన ప్రైవేట్ భాగాన్ని కోసేందుకు ప్రయత్నించి, తనను తీవ్రంగా గాయపరిచాడని బాధితుడు సతేంద్ర కుమార్ తెలిపాడు. గాయం వల్ల బాధితుడికి 12 కుట్లు వేయవలసి వచ్చింది.
గాయాల పాలైన బాధితుడి అరుపులు విని, గర్భిణితో ఉన్న అతడి భార్య ఇంటి నుంచి బయటకు వచ్చింది. భర్తను రక్షించేందుకు భార్య జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా, భూరే అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడని బాధితుడు తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. దంపతుల్ని చంపుతామని ఇద్దరు నిందితులు బెదిరించారట. నిందితుడికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.