Most wanted Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం…డాన్ సన్నిహితుడు ఛోటా షకీల్ సంచలన వ్యాఖ్యలు
అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే వార్తలపై అతని సన్నిహితుడైన ఛోటా షకీల్ మౌనాన్ని వీడారు. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఛోటా షకీల్ తన బాస్ పై విషప్రయోగం చేశారనే వార్తలను నిరాధారమైన వదంతి అని ఛోటా షకీల్ కొట్టిపారేశాడు....

Dawood Ibrahim,Chhota Shakeel
Most wanted Dawood Ibrahim : అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందనే వార్తలపై అతని సన్నిహితుడైన ఛోటా షకీల్ మౌనాన్ని వీడారు. దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఛోటా షకీల్ తన బాస్ పై విషప్రయోగం చేశారనే వార్తలను నిరాధారమైన వదంతి అని ఛోటా షకీల్ కొట్టిపారేశాడు. దావూద్ వెయ్యి శాతం ఫిట్‌గా ఉన్నాడని, ఆరోగ్యంగా ఉన్నాడని, ఇలాంటి పుకార్లు ఎప్పటికప్పుడు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు.
ALSO READ : Tamil Nadu rains : తమిళనాడులో భారీవర్షాలు..వరద బీభత్సం
దావూద్‌పై ఎవరో విషప్రయోగం చేశారనే పుకార్లు భారత్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పలువురు పాకిస్థానీ జర్నలిస్టులు కూడా దావూద్ పై ట్వీట్లు చేస్తూ ఈ ఊహాగానాలకు బలం చేకూర్చారు. అయితే, ఈ వార్త బూటకమని షకీల్ చెప్పాడు. పారిపోయిన అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ను ఇటీవల పాకిస్తాన్‌లో కలిశానని, అతను పూర్తిగా క్షేమంగా ఉన్నాడని షకీల్ చెప్పారు. దావూద్ ఇబ్రహీం పాక్ లో ఐఎస్ఐ అతిథి అని, అతని సహచరులు ఎవరైనా విషం ఇచ్చే అవకాశాలు లేవని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.
ALSO READ : Ram Temple : దలైలామా నుంచి అదానీ దాకా…రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు రామ్ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం
దావూద్ చాలా కాలంగా పాక్ ఐఎస్ఐ అతిథిగా కట్టుదిట్టమైన భద్రతలో జీవిస్తున్నాడని సమాచారం. దావూద్ కు నమ్మకమైన వ్యక్తులు అతనికి భద్రత కల్పిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. దావూద్ అనారోగ్యంతో పాటు పాక్ క్రికెట్ దిగ్గజం జావేద్ మియాందాద్‌ను కూడా గృహనిర్బంధంలో ఉంచినట్లు పాకిస్థాన్‌లో ప్రచారం జరిగింది.
ALSO READ : Earthquake : చైనాలో భారీ భూకంపం…86మంది మృతి
అండర్ వరల్డ్ డాన్‌కి జావేద్ మియాందాద్ సన్నిహితుడు. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. అయితే తన గడ్డపై అతని ఉనికి లేదని పాక్ ఖండించింది. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో షకీల్ ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్ విశ్వసిస్తుండగా, పాకిస్థాన్ దానిని ఖండించింది.