Ram Temple : దలైలామా నుంచి అదానీ దాకా…రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు రామ్ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బౌద్ధుల మత గురువు దలైలామా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ దాకా పలువురు ప్రముఖులను రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రామ్ జన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.....

Ram Temple
Ram Temple : పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బౌద్ధుల మత గురువు దలైలామా నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ దాకా పలువురు ప్రముఖులను రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రామ్ జన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం పూజ జనవరి 16వతేదీ నుంచి ప్రారంభమవుతుంది.
నిర్మాణ కార్మికులకు ఆహ్వానం
జనవరి 22 వతేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చంపత్ రాయ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కూడా ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న జ్ఞానులు, పూజారులు, మత పెద్దలను మాత్రమే కాకుండా మాజీ, ప్రస్తుత పరిపాలనా అధికారులు, జర్నలిస్టులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించింది.
పద్మ అవార్డుల గ్రహీతలకు కూడా…
దేశంలోని పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, నటులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలతో పాటు సైనికాధికారులు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అతిథుల జాబితాలో టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా, బాబా రామ్‌దేవ్, అదానీ గ్రూప్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, రిలయన్స్‌కు చెందిన ముఖేష్ అంబానీ, టాటా గ్రూపునకు చెందిన నటరాజన్ చంద్రశేఖరన్, ఎల్ అండ్ టీ గ్రూప్‌కు చెందిన ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్, నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మాధురీ దీక్షిత్ ఉన్నారు.
రామ్‌గా నటించిన అరుణ్ గోవిల్ కు…
రామానంద్ సాగర్ నిర్మించిన రామాయణం టీవీ సిరీస్‌లో రామ్‌గా నటించిన అరుణ్ గోవిల్, చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్, గీత రచయిత ప్రసూన్ జోషి తదితరులను కూడా ఆహ్వానించామని చంపత్ రాయ్ తాజాగా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి త్రిపుర, మిజోరాం, మేఘాలయ, సిక్కిం, అండమాన్ నికోబార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వరకు దేశవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు వేల మంది సాధువులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
విభిన్న వర్గాల మత పెద్దలకు ఆహ్వానం
125 విభిన్న వర్గాలకు చెందిన మత పెద్దలను ఆహ్వానించారు. 13 అఖాడాల మహంతులు, ఆరుగురు దర్శనాల ఆచార్యులు, శంకరాచార్యులు, బాబా రామ్‌దేవ్, కేరళ అమ్మ అమృతానందమయి నుంచి దలైలామా, ముంబయి నుంచి రాహుల్ బోధికి ఆహ్వానాలు పంపించామని రాయ్ చెప్పారు. అతిథుల జాబితాలో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్, సీబీఆర్ఐ శాస్త్రవేత్త దేబీ దత్తా కూడా ఉన్నారు. చర్చల తర్వాత అతిథి జాబితాను సిద్ధం చేశామని రాయ్ పేర్కొన్నారు.
జర్నలిస్టులకు కూడా…
క్రీడలు, శాస్త్రవేత్తలు, మీడియా సంస్థలు , 1984, 1992 సంవత్సరాల మధ్య క్రియాశీలంగా పనిచేసిన ప్రముఖ జర్నలిస్టుల ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. 1992లో అయోధ్యలో అప్పటి డిఐజితో పాటు యూపీ పోలీసు రిటైర్డ్ అధికారులను రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు అతిథులుగా ఆహ్వానిస్తామని రాయ్ తెలిపారు. కేవలం 25 మంది ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీస్ బేరర్‌లకు మాత్రమే ఆహ్వానం అందిందని, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన 100 మందికి మించలేదని ఆయన చెప్పారు.
ALSO READ : Tamil Nadu rains : తమిళనాడులో భారీవర్షాలు..వరద బీభత్సం
ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా కరసేవకపురంలో 1000 మందికి, నృత్య గోపాల్‌దాస్‌కు చెందిన యోగా, ప్రాకృతిక కేంద్రంలో మరో 850 మందికి వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. బాగ్ బిజౌసి అని పిలిచే తీర్థక్షేత్ర పురం ప్రాంతంలో 45 ఎకరాల స్థలంలో కొత్తగా స్థాపించిన టెంట్ సిటీలో 12,000 మందికి వసతి సిద్ధం చేశారు. వసతి గృహాలు, దుప్పట్లు, మెత్తని బొంతలు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు.
ALSO READ : Earthquake : చైనాలో భారీ భూకంపం…86మంది మృతి
ఈ కార్యక్రమంలో పాల్గొనే 3,500 మంది సాధువుల కోసం మణిపర్వత్ సమీపంలో మరో వసతి కేంద్రాన్ని సిద్ధం చేశామని రాయ్ తెలిపారు. అయోధ్యలో రామమందిరం కోసం జరిగిన ఆందోళనలో అగ్రగామిగా ఉన్న భాజపా కురువృద్ధులు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వారి ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా వచ్చేనెల జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ సోమవారం తెలిపింది.
ALSO READ : Iceland : ఐస్‌లాండ్‌లో పేలిన అగ్నిపర్వతం
‘‘ ఇద్దరూ కుటుంబ పెద్దలు, వారి వయస్సును పరిగణనలోకి తీసుకుని, వారిని రావద్దని అభ్యర్థించగా వారు ఇద్దరూ అంగీకరించారు’’అని రామ్ టెంపుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విలేకరులతో చెప్పారు.