Deepak Parekh : వైరల్ అవుతున్న HDFC మాజీ చైర్మన్‌ దీపక్ పరేఖ్ ఆఫర్ లెటర్

హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తాజాగా విలీనం అయిన తరువాత HDFC చైర్మన్‌గా ఉన్న దీపక్ పరేఖ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం ఆయన అందుకున్న ఆఫర్ లెటర్, మొదటి శాలరీ వివరాలు వైరల్ అవుతున్నాయి.

Deepak Parekh : వైరల్ అవుతున్న HDFC మాజీ చైర్మన్‌ దీపక్ పరేఖ్ ఆఫర్ లెటర్

Deepak Parekh

Updated On : July 6, 2023 / 12:31 PM IST

Deepak Parekh : దీపక్ పరేఖ్ ఎవరో చాలామందికి తెలుసు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) చైర్మన్‌గా ఉన్న ఆయన రీసెంట్‌గా తన పదవికి రాజీనామా చేశారు. సంస్థకు విలువైన సేవలు అందించిన దీపక్ పరేఖ్ మొదటి ఆఫర్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

HDFC Bank : ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయిన HDFC బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్

హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తాజాగా విలీనం అయిన సంగతి తెలిసిందే. దీనికి ముందు HDFC చైర్మన్‌గా ఉన్న దీపక్ పరేఖ్ రాజీనామా చేసి, ఉద్యోగులతో తన భావోద్వేగాల్ని పంచుకున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో పరేఖ్ మొదటి ఆఫర్ లెటర్ అని పేర్కొంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అది జూలై 19, 1978 నాటిదిగా తెలుస్తోంది. అందులో పరేఖ్ జీతం, అలవెన్స్‌ల వివరాలు ఉన్నాయి. అప్పట్లో డిప్యూటీ మేనేజర్ గా నియమించబడిన పరేఖ్‌కి రూ.3,500 జీతంతో పాటు రూ.500 అలవెన్స్‌గా నిర్ణయించారు. 45 సంవత్సరాల నాటి ఆ లెటర్‌లో 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ 10 శాతం ఉన్నాయి.

HDFC: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో 4వ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ.. టాప్-5 బ్యాంకులు ఇవే..

HDFCతో సుదీర్ఘంగా 45 ఏళ్లు పనిచేసిన పరేఖ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించిన వయసు పరిమితుల కారణంగా బోర్డులో పని చేయడం లేదు. ఆయన నాయకత్వంలో HDFC తొమ్మిది మిలియన్లకు పైగా భారతీయులకు ఇంటి రుణాలు అందించింది. విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. HDFC దాని మాతృసంస్థ భారతదేశపు మొదటి హోమ్ ఫైనాన్స్ కంపెనీ – HDFCని విలీనం చేసిన తరువాత ప్రపచంలోనే నాల్గవ అతి పెద్ద బ్యాంక్ గా అవతరించింది.