పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే

  • Published By: venkaiahnaidu ,Published On : August 29, 2019 / 09:00 AM IST
పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే

Updated On : August 29, 2019 / 9:00 AM IST

లేహ్ లో డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన 26వ ‘కిసాన్‌- జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’(సైన్స్‌ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు  తర్వాత లడఖ్ ను రక్షణ మంత్రి మొదటి సారిగా సందర్శించారు.

 ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ…ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్‌ను నాశనం చేయాలని చూస్తున్న పాకిస్తాన్ తో ఏం మాట్లాడగలం. పాక్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలనే మేము కోరుకుంటున్నాము. మొదట ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాక్‌ తగిన చర్యలు తీసుకుంటే మంచిది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాభాగమేమని రాజ్ నాథ్ అన్నారు.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకశ్మీర్ ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లడఖ్ ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. దీంతో లడఖ్ ప్రాంతానికి జమ్ము కశ్మీర్‌తో సంబంధాలు ఉండవు. ఈ ప్రాంత అభివృద్ధి నేరుగా కేంద్రం కనుసన్నల్లో జరగనుంది.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఎలా సహాయపడుతుందో అక్కడి అధికారులతో రాజ్ నాథ్ చర్చించనున్నారు.