ఢిల్లీలో ఘోరం : కుప్పకూలిన భవనం

  • Published By: madhu ,Published On : January 4, 2019 / 01:52 AM IST
ఢిల్లీలో ఘోరం : కుప్పకూలిన భవనం

15మంది ఆసుపత్రిలో చికిత్స. 
నలుగురి పరిస్థితి విషమం.
శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం.

ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఘోరం జరిగింది. ఓ భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏడుగురు మృతి చెందారు. సుదర్శన్ పార్కు ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ భవనంలో ఎల్పీజీ సిలిండర్ బ్లాస్ట్ కావడంతో భవనం నేలకూలింది. జనవరి 03వ తేదీ రాత్రి 08.48గంటల సమయంలో భవనం కుప్పకూలిందని ఫైర్ డిపార్ట్మెంట్‌‌కు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. రాత్రి నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నట్లు సమాచారం. 8 మందిని రెస్క్యూ టీం కాపాడింది. భవనం కుప్పకూలిపోవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. గాయాల పాలైన 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగిందని..ఇందులో 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీసు (వెస్ట్) చెప్పారు.