Delhi Airport: ‘నరకంలోకి స్వాగతం’.. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రద్దీతో ప్రయాణికుల ఇక్కట్లు
ఢిల్లీ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో జాప్యం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఎయిర్‌పోర్టు నిర్వాహకులకు ఇక్కడ ఎటువంటి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా ఐడీ చెక్, టికెట్ చెకింగ్ జరిగే చోట ఈ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది.

Delhi airport overcrowding complaints flood social media as govt steps in
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత కొన్నాళ్లుగా తీవ్రమైన రద్దీ నెలకొంది. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్‌లు పూర్తిచేసుకొని విమానం ఎక్కడానికి గంటల సమయం పడుతోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమ అవస్థల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ‘నరకంలోకి స్వాగతం’ అంటూ కొంత మంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢల్లీ ఎయిర్‌పోర్టు బాధితుల్లో ‘హైవే ఆన్ మై ప్లేట్’ షో వ్యాఖ్యాత రాకీ సింగ్ కూడా ఉన్నారు. ఆయన ఆదివారం ఉదయం అక్కడి పరిస్థితిని నరకంతో పోలుస్తూ.. ట్వీట్ చేశారు. కిక్కిరిసిపోయిన ఢిల్లీ ఎయిర్ పోర్టు లాంజ్ ఫొటోను పంచుకొన్నారు. ఈ ట్వీట్‌లో పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేశారు.
ఢిల్లీ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో జాప్యం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఎయిర్‌పోర్టు నిర్వాహకులకు ఇక్కడ ఎటువంటి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా ఐడీ చెక్, టికెట్ చెకింగ్ జరిగే చోట ఈ సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విస్తరణ పనులు జరుగుతుండటంతో ప్రయాణికులను టెర్మినల్-3 వైపు మళ్లించడం కూడా సమస్యకు కారణమవుతోంది. ప్రస్తుతం 6.6 కోట్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యం ఉన్న విమానాశ్రయాన్ని 10 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ పనులు చేస్తున్నారు. ఇవి చాలా వరకు పూర్తైనట్లు ప్రభుత్వం పేర్కొంది.
Congress Bill: రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ లోక్‌సభలో సంచలన బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్