పెట్రోల్, డీజిల్ వెహికల్స్ బ్యాన్.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..

వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

పెట్రోల్, డీజిల్ వెహికల్స్ బ్యాన్.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..

Updated On : June 6, 2025 / 9:55 AM IST

Delhi: వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వాయు కాలుష్య ఉపశమన ప్రణాళిక -2025ని ప్రకటించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రానుంది.

Also Read: ఎలాన్ మస్క్‌కు బిగ్‌షాక్.. ట్రంప్‌తో విభేదాల ఎఫెక్ట్.. టెస్లా షేర్లు ఢమాల్.. 13లక్షల కోట్లు నష్టం

ఢిల్లీతోపాటు గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ లోనూ వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించనున్నారు. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ క్వాబ్, అగ్రిగేటర్లు, డెలివరీ కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఇది లైట్ కమర్షియల్, లైట్ గూడ్స్ వెహికిల్స్, డెలివరీల కోసం వాడే టూ వీటర్లకు వర్తిస్తుంది.

 

వాయు కాలుష్య నివారణ ప్రణాళిక-2025 ను వివరిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మాట్లాడారు. నవంబర్ 1వ తేదీ నుంచి బీఎస్-వీఐ (భారత్ స్టేజ్6), సీఎన్జీ లేదా ఈవీ వాణిజ్య వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 నుండి ఢిల్లీకి వచ్చే ఏ వాహనం అయినా బీఎస్6, సీఎన్జీ లేదా ఈవీ వాణిజ్య వాహనం అయి ఉండాలని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం మనందరికీ సంబంధించిన విషయం. సంవత్సరాలుగా మనం వాయు కాలుష్యంతో బాధపడుతున్నాము. మా ప్రభుత్వానికి ఒక కల ఉంది. స్వచ్ఛమైన ఢిల్లీ, ఆకుపచ్చ ఢిల్లీ, ఆరోగ్యకరమైన ఢిల్లీని తయారు చేయాలని. అందుకు తగిన విధంగా మా పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాయు కాలుష్యం తగ్గింపు ప్రణాళిక-2025ను రూపొందిచడం జరిగిందని రేఖ గుప్తా పేర్కొన్నారు.


ఢిల్లీలో అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ (ఏఎన్పీఆర్) రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. ఇవి ఈఓఎల్ వాహనాలను గుర్తిస్తాయి. తద్వారా వాటి ప్రవేశాన్ని నిరోధించడానికి హెచ్చరికలు జారీ చేస్తాయని తెలిపారు. పెట్రోల్ బంక్ ల వద్ద కూడా ఏఎన్పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.