Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో కీలక నేతలు

న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్‌ వెనుకంజలో ఉన్నారు.

Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో కీలక నేతలు

Updated On : February 8, 2025 / 9:53 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పలువురు ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. కాల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్‌ వెనుకంజలో ఉన్నారు.

కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్‌వేర్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ఆధిక్యంలో ఉన్నారు. బద్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర యాదవ్‌ వెనుకంజలో కొనసాగుతున్నారు. పత్పర్‌గంజ్‌లో ఆప్‌ అభ్యర్థి అవధ్‌ ఓజా వెనుకంలో ఉన్నారు.

YS Sharmila: జగన్‌ గురించి విజయసాయిరెడ్డి నాకు ఈ విషయాలు అన్నీ చెప్పేశారు: వైఎస్ షర్మిల

ముందంజలో వీరు..
షాకుర్‌బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్రకుమార్‌ జైన్‌ ముందంజలో ఉన్నారు. ఓక్లా స్థానంలో ఆప్‌ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్‌ లవ్లీ ముందంజలో ఉన్నారు.

బిజ్వాసన్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్‌ ముందంజలో కొనసాగుతున్నారు. జంగ్‌పురలో మొదట వెనుకంజలో కొనసాగిన మనీశ్‌ సిసోడియా ఆ తర్వాత పుంజుకుని ముందంజలోకి వచ్చారు.

సీఎం అభ్యర్థి గురించి వారిదే నిర్ణయం: ఢిల్లీ బీజేపీ చీఫ్ 
ఢిల్లీలో ఆప్‌ వెనుకంజలో ఉండడంతో ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ చెప్పిన అసత్యాలను ఎవరూ నమ్మలేదని అన్నారు. ప్రజలకు ద్రోహం చేసిన వారిని ప్రజలు ఇలాగే ఓడిస్తారని చెప్పారు. సీఎం అభ్యర్థి గురించి బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.