వీళ్లింతే : పార్టీ ఆఫీసులోనే భార్యను ఈడ్చికొట్టిన బీజేపీ నేత

వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. ముఖ్యంగా మహిళలపై వారు చేసే వ్యాఖ్యల గురించి తెలియనిది కాదు. గతంలో ఎన్నో ఇటువంటివి జరిగాయి. కానీ ఓ బీజేపీ నేత మరో అడుగు వేసి ఏకంగా పార్టీ ఆఫీసులోనే భార్యపై చేయి చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే..సదరు బీజేపీ నేత భార్య మాజీ మేయర్ కూడా. భార్యపై చేయి చేసుకున్న ఆ నేత పార్టీ అధ్యక్షుడు కావటం మరో విశేషం.
వివరాల్లోకి వెళితే..ఆజాద్ సింగ్ మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు.అతని భార్య సరితా చౌదరి. ఆమె దక్షిణ ఢిల్లీ మాజీ మేయరు. బీజేపీ ఆఫీసులో భార్య సరితా చౌదరిపై భర్త ఆజాద్ సింగ్ ఈడ్చి ఈడ్చి మరీ కొట్టాడు. దీంతో అక్కడ ఉన్న నేతలు..కార్యకర్తలు షాక్ అయ్యారు. అందరి ముందే భార్యను బీజేపీ నేత ఆజాద్ సింగ్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో మెహరౌలీ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆజాద్ సింగ్ పై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే చర్యలు తీసుకుంటూ..అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. మెహరౌలి జిల్లాకు తాత్కాలిక అధ్యక్షుడిగా మరో బీజేపీ నాయకుడు వికాస్ తన్వర్ ను నియమించారు.
కాగా ఆజాద్ సింగ్, సరితాల మధ్య విభేధాలు ఉన్నాయనీ..వీరిద్దరు విడాకులు తీసుకునేందుకు కోర్టులో అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నిత్యానంద్ రాయ్ పార్టీ 14 జిల్లా యూనిట్ల ఆఫీసర్ బేరర్ల సమావేశాలు చేస్తున్నారు. ఈ సమావేశానికి ఆజాగ్ సింగ్ ..అతని భార్య సరితా సమావేశానికి హాజరయ్యారు. క్రమంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలతో పార్టీ ఆఫీసులో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆజాగ్ సింగ్ భార్య సరితను దారుణంగా కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో అధిష్టానం చర్యలు తీసుకుంది.
#कार्यालय ~ @BJP4India/@BJP4Delhi#मामला ~ कार्यालय में ही @BJP4Delhi के नेता ने महिला को सरेआम थप्पड़ जड़ दिया।
जी, ये वही कार्यालय है जहाँ पर #मोदी जी ने महिला के सम्मान के लिए इन जैसे नेताओं को कई बार मंत्र दिया था। बाकी सब सामने है। ?@Ms_Aflatoon @rohini_sgh @juhiesingh pic.twitter.com/tiv1DQD8Mw— Devesh Pandey | देवेश पांडेय | دیویش پانڈے۔ (@iamdevv23) September 19, 2019