Delhi : ఢిల్లీలో కొత్త రూల్స్… ప్రయాణీకుల అవస్థలు..2 కి.మీటర్ల క్యూ లైన్‌లు
మెట్రో రైల్వే స్టేషన్, బస్టాపుల వద్ద ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. కేవలం 50 శాతం సామర్థ్యంతో రైళ్లు, బస్సులు తిప్పాలని చెప్పడంతో అంతేమందిని ఎక్కించుకుని వెళుతున్నారు.

Delhi Covid
Delhi COVID-19 Travel Rules : దేశ రాజధానిలో అస్తవ్వస్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా..కొత్త వేరియంట్ కారణంగా ప్రభుత్వం విధించిన నిబంధనలు, ఆంక్షలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్న క్రమంలో..కేజ్రీవాల్ సర్కార్ అలర్ట్ అయ్యింది. కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించి…నియమ నిబంధనలు తు.చ.తప్పకుండా పాటించాలని చెప్పింది. ప్రధానంగా ప్రజా రవాణాపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో, బస్సుల్లో 50 శాతం సామర్థ్యంతో పని చేయాలని ఆదేశించింది.
Read More : CM Nitish kumar : బీహార్ లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది : సీఎం నితీశ్ కుమార్
అంతేగాకుండా..ఆటో, క్యాబ్‌లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2021, డిసెంబర్ 29వ తేదీ బుధవారం మెట్రో రైల్వే స్టేషన్, బస్టాపుల వద్ద ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. కేవలం 50 శాతం సామర్థ్యంతో రైళ్లు, బస్సులు తిప్పాలని చెప్పడంతో అంతేమందిని ఎక్కించుకుని వెళుతున్నారు. మిగతా ప్రయాణీకులు నెక్ట్స్ బస్సు, రైళ్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రయాణీకులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. గమ్యస్థానాలకు చేరుకొనేందుకు ముందుగా ఎక్కాలని కొంతమంది ప్రయత్నిస్తుండడంతో తొక్కిసలాట చోటు చేసుకొంటోంది. కొత్త నిబంధనలతో ఢిల్లీ వాసులు అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు.
Read More : Scientists Warning: అంతరిక్షంలోకి మనుషులు వెళితే చంపుకుతినడం ఖాయం: శాస్త్రవేత్తలు
ఇదిలా ఉంటే…దేశంలో కరోనా వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. 127 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఒమిక్రాన్ మహారాష్ట్రకు తీసిపోని విధంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో సగం కంటే ఎక్కువ కేసులు ఢిల్లీలోనే రికార్డయ్యాయి. దీంతో దేశ రాజధానిలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 238కు చేరింది. పాజిటివిటి రేటు కూడా పెరగడంతో ఢిల్లీ సర్కార్ అక్కడ ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎల్లో అలర్ట్ అమలులో స్కూళ్లు, కాలేజ్‌లు, సినిమాహాళ్లు, జిమ్‌లు మూసివేస్తారు. రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.