RT-PCR Rule: తెలంగాణ-ఏపీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ రూల్ ఎత్తేసిన ఢిల్లీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనను ఎత్తేసింది ఢిల్లీ ప్రభుత్వం. సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ.. వెంటనే అమలుకావాలని ఆదేశాలిచ్చింది.

RT-PCR Rule: తెలంగాణ-ఏపీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ రూల్ ఎత్తేసిన ఢిల్లీ

Delhi Ends Mandatory Rt Pcr Rule For Passengers From Telangana Ap

Updated On : June 14, 2021 / 11:52 PM IST

RT-PCR rule: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలనే నిబంధనను ఎత్తేసింది ఢిల్లీ ప్రభుత్వం. సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ.. వెంటనే అమలుకావాలని ఆదేశాలిచ్చింది. సోమవారం దీని గురించి ట్వీట్ చేసిన స్పైస్ జెట్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి వచ్చేవారు ఆర్టీపీసీఆర్ టెస్టు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.

ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎమ్ఏ) మే6న ఢిల్లీకి వచ్చే తెలుగు రాష్ట్ర ప్రయాణికులు.. 14రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలని ఆర్డర్ చేసింది. ఎయిర్ లైన్స్, ట్రైన్స్ లేదా వేరే ఏదైనా ట్రాన్స్ పోర్టేషన్ ద్వారా ప్రయాణించినా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కావాలి లేదా 72గంటలకు ముందే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకుని నెగెటివ్ రిపోర్టుతో ఉండాలని చెప్పింది.

స్పైస్ జెట్ చేసిన ట్వీట్ తో పాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేసింది. ‘ఢిల్లీకి వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దేశ రాజధాని ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే ఇది అమల్లోకి వస్తుంది’ అని పోస్టు చేసింది.