అక్కపై ప్రతీకారం తీర్చుకోవాలని చెల్లెలు ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో పెట్టేసి…

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ పేరిట మల్టిపుల్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు కనిపించి ఆశ్చర్యపరిచాయి. అంతేకాకుండా ఆ ఫేక్ అకౌంట్లలో యువతి ఫోన్ నెంబర్ ఉంచి పోస్టులు కూడా పెట్టాడు. సెక్సువల్ ఫేవర్స్ కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయాలని సూచించడంతో.. పలువురు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బూతు మాటలతో.. వేధించడం మొదలుపెట్టారు.
సౌత్ ఢిల్లీకి చెందిన నెబ్ సరై ఏరియా బాధితురాలు పోలీసులను సంప్రదించి.. గుర్తు తెలియని వ్యక్తులెవరో కాల్ చేసి లైంగిక కోర్కెలు తీర్చాలంటూ వేధిస్తున్నారని.. తన పేరు మీద ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో ఫేక్ అకౌంట్లు కనిపిస్తున్నాయని కంప్లైంట్ చేసింది.
వెంటనే ఫేక్ ప్రొఫైల్స్ తొలగించి.. టెక్నికల్ సర్వేలెన్స్ ఉంచారు. నిందితుడ్ని ట్రాక్ చేసి ఉమేశ్ కుమార్ గా గుర్తించారు. ‘ఈ ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయడానికి వాడిన ఫోన్ నెంబర్లపై నిఘా పెట్టాం. అదే నిందితుడ్ని పట్టించింది’ అని డీసీపీ తెలిపారు.
నిందితుడు… బాధితురాలు అక్కకు ఫ్రెండ్. మార్చి 2020తర్వాత వారిద్దరూ రిలేషన్‌షిప్ నుంచి దూరమయ్యారు. ఈ బ్రేకప్ తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఫోన్ నెంబర్లు పెట్టి పోస్టు చేశాడని డీసీపీ తెలిపారు.