Diwali-2023: దీపావళి వేళ పటాకులపై నిషేధం విధిస్తూ ఢిల్లీ సర్కారు నిర్ణయం
చలికాలంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Firecrackers In Delhi
Diwali-2023 Delhi: దీపావళి సీజన్‌లోనూ ఢిల్లీలో పటాకులు కాల్చడం, ఉత్పత్తి, నిల్వలు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సోమవారం ప్రకటన చేసింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… చలికాలంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు సూచనలు చేశామని అన్నారు. ఢిల్లీలో ప్రజలు ఈ ఆదేశాలు పాటించేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పామని వివరించారు. గత మూడేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ఇటువంటి చర్యలే తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కొన్నేళ్లుగా గాలి నాణ్యత మెరుగుపడుతుందని అన్నారు. దాన్ని ఇంకా మెరుగుపర్చాల్సి ఉందని తెలిపారు.
అందుకే ఈ ఏడాది కూడా పటాలకుపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పటాకుల లైనెస్సులు ఇవ్వకూడదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణకు దృష్టిలో పెట్టుకుని మతపర వేడుకలను జరుపుకోవాలని ఆయన అన్నారు. ఢిల్లీ వాసులుగా తాము దీపావళిని లైట్లు, దీపాలతో జరుపుకుంటామని చెప్పుకొచ్చారు. కాగా, పటాకులు కాల్చితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తామని గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
Rahul Gandhi: గీత, ఉపనిషత్తుల్లో ఇలాంటివి ఎక్కడాలేవు: రాహుల్ గాంధీ