Bars & Pubs : తెల్లవారుఝూము 3 గంటల దాక బార్లకు, పబ్‌లకు అనుమతి
ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్‌లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు.

Delhi Government New Excise Policy Bars Pubs Open Till 3 Am Walk In Experience At Liquor Vends
Bars, Pubs Open Till 3 AM : ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇకనుంచి బార్లు, పబ్‌లను తెల్లవారు ఝూమున 3 గంటల దాకా తెరిచి ఉంచేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం నిన్నటినుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం రాష్ట్రానికి అతి కీలకమని ప్రభుత్వం పేర్కోంది. మద్యం తాగే వయస్సును కూడా 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించింది. కొత్త పాలసీలో ప్రభత్వ రిటైల్ షాపులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రైవేట్ షాపులను ప్రమోట్ చేస్తూ పాలసీని రూపోందించింది.
వైన్ షాపులను పూర్తి ఏసీతో గ్లాస్ డోర్లతో ఉండేలా రూపోందించాలని తెలిపింది. లిక్కర్ షాపుల ఎదురు కుండా బారులు తీరకుండా, షాపులోకి వచ్చి వారికి నచ్చిన బ్రాండ్ కొనుక్కునేలా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. బీర్లు తయారీ కోసం మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
హోటళ్లు రెస్టారెంట్లు కబ్బుల్లోని బార్లు తెల్లవారఝూము 3 గంటలవరకు తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చింది. విదేశీ సందర్శకులు ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో ఢిల్లీ 28 వ స్ధానంలో ఉందని కొత్త ఎక్సైజ్ పాలసీలో పేర్కోన్నారు.