Delhi Man Quits Job : ఆఫీస్ దూరమైందని మొదటిరోజే జాబ్‌కు రిజైన్.. సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందనతో కంగుతిన్న యువకుడు..

అతను పోస్టు పెట్టిన గంటల వ్యవధిలోనే 400కుపైగా మంది తమ స్పందనలు తెలిపారు. వారు రోజూ ఎంతదూరం ప్రయాణించి కార్యాలయాలకు వెళ్తున్నారో, ఎన్ని గంటల సమయం పడుతుందో వెల్లడించారు.

Delhi Man Quits Job : ఆఫీస్ దూరమైందని మొదటిరోజే జాబ్‌కు రిజైన్.. సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందనతో కంగుతిన్న యువకుడు..

Job Resignation

Updated On : August 10, 2023 / 1:30 PM IST

Job Resignation: ఉద్యోగ నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాలంటే కొందరు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మెట్రో, బస్సు, ఇతర వాహనాల్లో గంటల తరబడి ప్రయాణం చేసి, ఉద్యోగం పూర్తయ్యాక మళ్లీ గంటల తరబడి ప్రయాణం చేసి ఇంటికి చేరుతారు. ఇలాంటి వారు ప్రధాన నగరాల్లో అనేక మందే ఉంటారు. కానీ, కొత్తగా ఉద్యోగంలో చేరిన ఢిల్లీకి చెందిన ఓ యువకుడు మూడు గంటలు ప్రయాణించి కార్యాలయానికి వెళ్లడం నావల్ల కాదంటూ ఉద్యోగంలో చేరిన మొదటిరోజే రిజైన్ చేశాడు. ఈ విషయాన్ని రెడ్డిటోర్స్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టులు వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి వస్తున్న సలహాలు, వారు రోజు ఎంతదూరం ప్రయాణిస్తున్నారు అనే వివరాలను చూసి యువకుడి దిమ్మతిరిగిపోయింది.

Vitamin D : విటమిన్ డి లోపంతో డిప్రెషన్‌ సమస్యకు గురికావాల్సి వస్తుందా?

యువకుడి పోస్టు ప్రకారం.. ఢిల్లీలోని వాయువ్య ప్రాంతంలో నివసించే అతనికి మంచి వేతనంతో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండు రౌండ్ల ఇంటర్వ్యూ తరువాత కంపెనీ అతన్ని నియమించుకుంది. అతను ఢిల్లీ వాయువ్య ప్రాంతంలో (పింక్ లైన్) నివసిస్తున్నాడు. గురుగ్రామ్‌లో అతను ఉద్యోగం పొందిన కార్యాలయం ఉంది. మొదటి రోజు ఉత్సాహంగా కార్యాలయంకు బయలుదేరిన అతను అక్కడికి చేరుకోవటానికి గంటల సమయం పట్టింది. దీంతో ప్రతీరోజూ ఇంతదూరం ప్రయాణించి ఉద్యోగం చేయలేక ఉద్యోగంలో చేరిన మొదటిరోజే ఆ వ్యక్తి జాబ్‌కు రిజైన్ చేశాడు. కొన్ని లెక్కల ప్రకారం.. ఈ ఉద్యోగం కొనసాగిస్తే నేను రోజుకు ఇంట్లో కేవలం  నిద్రపోయే సమయం కాకుండా మూడు గంటలు మాత్రమే ఉండాల్సి వస్తుంది.  అలాగని తన కార్యాలయం వద్దకు నేను సిఫ్ట్ కాలేను. ప్రతీరోజూ ఇంతదూరమూ ప్రయాణం చేయలేను. దీనికితోడు ప్రయాణానికి దాదాపు ఐదువేలు ఖర్చు అవుతుంది. రిజైన్ చేయడం తప్ప నా వద్ద మరో మార్గం లేదు.. మీరు ఏమైనా సలహాలు ఇవ్వండిఅని రెడ్డిటోర్స్ లో పోస్టు చేశారు.

 

Job Resignation

Job Resignation

అతను పోస్టు పెట్టిన గంటల వ్యవధిలోనే 400కుపైగా మంది తమ స్పందనలు తెలిపారు. వారు రోజూ ఎంతోదూరం ప్రయాణించి కార్యాలయాలకు వెళ్తున్నారో, ఎన్ని గంటల సమయం పడుతుందో వెళ్లడించారు. కొందరైతై మేము ప్రతీరోజూ కేవలం నిద్రపోయే సమయం కాకుండా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఇంటివద్ద ఉండాల్సి వస్తుందని తమ అనుభవాలను పంచుకున్నారు. పోస్టుకు వచ్చిన ప్రతిస్పందనలను చూసిన తరువాత ఆ వ్యక్తి తొందరపాటుతో జాబ్ కు రిజైన్ చేశానని అంగీకరించాడు. నేను తప్పు చేశాను, ప్రతిఒక్కరూ రోజూ కొన్ని గంటల తరబడి ప్రయాణం చేసి కార్యాలయాలకు వెళ్తున్నారని నాకు ఇప్పటి వరకు తెలియదు. వీరితో పోల్చితే నా సమస్య చాలా చిన్నది. నేను నా నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నాను. తదుపరిలో నాకు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ధన్యవాదాలు అంటూ రాశాడు.