జైల్లో గ్యాంగ్‌స్టర్ డిమాండ్స్ : ఇంట్లో వండిన నాన్ వెజ్..ఐపాడ్, ఫోన్ కావాలి 

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 07:01 AM IST
జైల్లో గ్యాంగ్‌స్టర్ డిమాండ్స్ : ఇంట్లో వండిన నాన్ వెజ్..ఐపాడ్, ఫోన్ కావాలి 

Updated On : December 3, 2019 / 7:01 AM IST

ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కరడు కట్టిన గ్యాంగ్ స్టర్ డిమాండ్స్ తో హల్ చల్ చేశాడు. 40 నేరాలు చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ నీతూ అలియాస్ బవానా తనదైన శైలిలో డిమాండ్స్ చేస్తూ..నాకు తినటానికి నాన్ వెజ్ కావాలి..అది కూడా ఇంట్లో వండిన బిర్యానీ కావాలి..ఐపాడ్, ఎఫ్ఎం రేడియో వంటి లిస్ట్ తో డిమండ్స్ చేస్తున్నాడు. అధికారులకు ఈ లిస్ట్ చెప్పి నేను చెప్పినవి తీసుకురావాల్సిందేనంటు హల్ చల్ చేస్తున్నాడు. 

ఢిల్లీకి చెందిన నీతూ అలియాస్ బవానా కరడుకట్టిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్. భూకబ్జాలు, డబ్బు వసూళ్లు, హత్య, హత్యలు ఇలా బవానా చేసిన నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఢిల్లీ పోలీసులకు చుక్కలు చూపించి ఎట్టకేలకు అరెస్ట్ అయిన బవానా  40 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. విదేశీ రివాల్వరుతో బెదిరించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తు ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు. నీరజ్ బవానాకు ఢిల్లీలో వందమందికి పైగా గ్యాంగ్ ఉంది. పలు కేసుల్లో వారిని ఇప్పటికే 40 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

లెక్కలేనన్ని నేరాలకు పాల్పడిన నీరజ్ ను 2015 ఏప్రిల్ లో అరెస్టు చేసి తీహార్ జైల్లో అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీతో ఓ స్పెషల్ సెల్ కు తరలించారు. నీరజ్ బవానా డిమాండ్లు విన్న జైలు అధికారులు జైలు నిబంధల ప్రకారం ఇటువంటివి చేసేది లేదని గ్యాంగ్ స్టర్ కు స్పష్టం చేశారు. కాగా గతంలో కూడా నీరజ్ బవానా తనకు జైల్లో బోర్ కొడుతోందనీ.. టీవీ, ఫోన్ లాంటివి కావాలని కోర్టును కోరుకున్నాడు. కానీ కోర్టు దానికి పర్మిషన్ ఇవ్వలేదు.

జైలు జీవితం అనుభవించేవారు అధికారులు చెప్పిన పని చేయాలి, వారు పెట్టింది తినాలి. కానీ నేను స్పెషల్ అంటూ డిమాండ్స్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ నీరజ్ బనావా మాత్రం తానేదో పెద్ద వీఐపీలా డిమాండ్స్ లిస్ట్ ఇవ్వటం దాని కోసం కోర్టులకు వెళ్లటం విశేషంగా మారింది.