Delhi Police : ‘రోడ్లపై మూర్ఖుల్లాగ ఉండకండి’ అంటూ.. 3 ఇడియట్స్ సీన్ రీక్రియేట్ చేసిన ఢిల్లీ పోలీసులు
రోడ్లపై మూర్ఖుల్లాగ ఉండకండి అంటున్నారు ఢిల్లీ పోలీసులు.. తాజాగా 3 ఇడియట్స్ సినిమాలోని సీన్ రీక్రియేట్ చేసి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసిన పలువురికి జరిమానాలు విధించారు.

Delhi Police
Delhi Police : ‘రోడ్లపై మూర్ఖుల్లాగ ఉండకండి’ అంటున్నారు ఢిల్లీ పోలీసులు. 3 ఇడియట్స్ సీన్‌ని రీక్రియేట్ చేసిన ఢిల్లీ పోలీసులు మోటార్ సైకిలిస్ట్ ట్రిపుల్ రైడింగ్ వీడియోను షేర్ చేశారు. పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి రూ.17,000 జరిమానా విధించారు.
ట్రాఫిక్ నిబంధనలు అనుసరించడం.. సురక్షితంగా డ్రైవ్ చేయడం వంటి అంశాలపై ఢిల్లీ పోలీసులు పదే పదే సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తుంటారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో కాస్త హాస్యాన్ని జోడించిన వీడియోలు షేర్ చేస్తుంటారు. రీసెంట్‌గా ట్విట్టర్ పోస్ట్ చేసిన వీడియోలో 2009 లో వచ్చిన 3 ఇడియట్స్ నుంచి ఓ సీన్ రీక్రియేట్ చేశారు. బైక్ మీద ఇద్దరు మహిళలతో ఓ మోటార్ సైకిలిస్ట్ డ్రైవ్ చేస్తుంటాడు. వారికి ఎలా జరిమానా విధించారో ఢిల్లీ పోలీసులు పంచుకున్నారు. ‘జానే నహీ దేంగే తుజే’ పాట ప్లే అవుతుండగా రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్‌పై ముగ్గురు వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
Delhi Police : హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన పెళ్లికూతురు.. స్పందించిన ఢిల్లీ పోలీసులు
డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఫోటోలను చూపించారు. రూ.17,000 జరిమానా విధించిన చలాన్‌ను జత పరిచారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం మరియు పియూసీ సర్టిఫికేట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు ముగ్గురికి జరిమానా విధించారు. రోడ్లపై మూర్ఖులుగా ఉండకండి.. అని వీడియో చివర్లో ఢిల్లీ పోలీసులు తమ సందేశంలో హెచ్చరించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.
AAL IZZ NOT WELL if you drive or ride dangerously for the sake of reels!@dtptraffic #DriveResponsibly pic.twitter.com/JWO3pLDiWv
— Delhi Police (@DelhiPolice) July 24, 2023