Delhi : ఆత్మారామ్‌కి 7 జీవితాలున్నాయి.. మీకు కాదంటూ ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్

ట్రాఫిక్ నియమాలపై ఢిల్లీ పోలీసులు పౌరుల్ని అప్రమత్తం చేస్తుంటారు. ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులు 'గన్స్ అండ్ గులాబ్స్' అంటూ షేర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Delhi : ఆత్మారామ్‌కి 7 జీవితాలున్నాయి.. మీకు కాదంటూ ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్

Delhi

Updated On : August 22, 2023 / 11:42 AM IST

Delhi : నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా రోడ్డు భద్రతపై చమత్కారంగా వారు పోస్ట్ చేసిన ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Delhi Police : ‘రోడ్లపై మూర్ఖుల్లాగ ఉండకండి’ అంటూ.. 3 ఇడియట్స్ సీన్ రీక్రియేట్ చేసిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రోడ్లపై ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్‌లో
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ఢిల్లీ పోలీసులు చమత్కారవంతమైన ట్వీట్లు పెడుతుంటారు. తాజాగా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో (@DelhiPolice) వెబ్ సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’ స్టిల్ ఫోటోను షేర్ చేశారు. ఈ సిరీస్ లో ఆత్మారామ్ క్యారెక్టర్‌లో నటించిన గుల్షన్ దేవయ్య హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నట్లు చూడవచ్చు.

Bicycle Stunt : రోడ్డుపై ఘోరంగా ఫెయిలైన సైకిల్ స్టంట్.. వీడియో షేర్ చేసిన ఢిల్లీ పోలీసులు

‘ఆత్మారామ్ కి 7 జీవితాలు ఉన్నాయి. మీకు అలా కాదు. గేర్ అప్ మరియు స్మార్ట్ రైడ్ చేయడం మర్చిపోవద్దు. రైడింగ్ చేసేటపుడు హెల్మెట్ తప్పకుండా ధరించండి’ అనే శీర్షికతో పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ ట్వీట్ చాలా క్రియేటివ్‌గా ఉంది..స్మార్ట్ మార్కెటింగ్ అంటూ కామెంట్లు చేశారు. సున్నితమైన హాస్యాన్ని జోడిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న ఢిల్లీ పోలీసుల క్రియేటివిటీని జనం మెచ్చుకుంటున్నారు.