Delhi Covid-19 Cases : ఢిల్లీలో కొత్తగా 109 కేసులు, 8 మరణాలు..!

దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 109 కేసులు నమోదు కాగా.. 8 మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.14 శాతానికి పడిపోయింది.

Delhi Covid-19 Cases : ఢిల్లీలో కొత్తగా 109 కేసులు, 8 మరణాలు..!

Delhi Reports 109 New Covid Cases, 8 Deaths; Positivity Rate

Updated On : June 24, 2021 / 8:33 PM IST

Delhi Covid-19 Cases : దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 109 కేసులు నమోదు కాగా.. 8 మరణాలు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.14 శాతానికి పడిపోయింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డేటాను షేర్ చేసింది.

నగరంలో కొత్త కరోనా మరణాల సంఖ్య 24,948కి చేరింది. బుధవారం నాటికి ఢిల్లీలో కరోనా కేసులు 111 చేరగా.. 7 మరణాలు నమోదయ్యాయి. ఇక పాజిటివిటీ రేటు 0.15 శాతంగా నమోదైంది.

ఫిబ్రవరి 22 నాటికి కరోనా కేసులు 128గా ఉండగా.. జూన్ 14 నాటికి నగరంలో 131 కరోనా కేసులు నమోదు కాగా.. 16 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో సోమవారం నాటికి 89 కరోనా కేసులు నమోదు కాగా.. పాజిటివిటీ రేటు 0.16 శాతంగా ఉంది. ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం కూడా. ఇక కరోనా మరణాలు 11వరకు నమోదయ్యాయి.