Bomb Threat: స్కూల్లో బాంబు ఉందని మెయిల్ పంపిన బాలుడు.. ఎందుకో తెలుసా?
ఈ ఘటనలో పోలీసులు 14 ఏళ్ల విద్యార్థిని గుర్తించి విచారిస్తున్నారు. విద్యార్థికి పాఠశాలకు..
స్కూల్‌కి వెళ్లకూడదని అనుకుంటే కడుపునొప్పి వస్తుందనో, జ్వరం వచ్చిందనో చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లలు. ఓ బాలుడు మాత్రం స్కూల్‌కి వెళ్లకూడదని ప్లాన్ వేసుకుని పాఠశాలలో బాంబు ఉందంటూ మెయిల్ పంపి, బడి సిబ్బందిని, పోలీసులను పరుగులు పెట్టించాడు.
ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్-1లోని కైలాశ్ కాలనీలో సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ ఉంటుంది. పాఠశాలను బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో వెంటనే స్కూలు ఆవరణను ఖాళీ చేయించారు. 10 నిమిషాల్లో క్లాసుల నుంచి విద్యార్థులను పంపించేశామని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ షాలినీ అగర్వాల్ తెలిపారు.
ఈ ఘటనలో పోలీసులు 14 ఏళ్ల విద్యార్థిని గుర్తించి విచారిస్తున్నారు. విద్యార్థికి పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకే ఇటువంటి పని చేశాడని పోలీసులు తెలిపారు. విద్యార్థి అతడు చదివే స్కూలుతో పాటు మరో రెండు పాఠశాలల పేర్లనూ మెయిల్‌లో పేర్కొన్నాడని తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం ఢిల్లీలోని 131 పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలుడు కూడా అటువంటి ఈ-మెయిలే పంపడం గమనార్హం.
Also Read: ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోంది.. అధికారులపైనా చర్యలుంటాయి : సీఎం చంద్రబాబు నాయుడు