Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్

: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో 'శివలింగం' కనిపించిన వార్తలను ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్‌. ఈ మేరకు గానూ అతణ్ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్

Gyanvapi

Updated On : May 21, 2022 / 12:51 PM IST

Gyanvapi Mosque: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో ‘శివలింగం’ కనిపించిన వార్తలను ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్‌. ఈ మేరకు గానూ అతణ్ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఉత్తర ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు రతన్ లాల్ అనే అసోసియేట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. మత ప్రాతిపదికన సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. “సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు” పాల్పడినట్లు పేర్కొన్నారు.

ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు లాల్‌పై మంగళవారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన ఫిర్యాదులో, న్యాయవాది వినీత్ జిందాల్.. “మిస్టర్ లాల్ ఇటీవల శివలింగంపై అవమానకరమైన, రెచ్చగొట్టే విధమైన ట్వీట్ చేశారని” అన్నారు.

Read Also: జ్ఞానవాపి మసీదు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

ఈ సమస్య చాలా సున్నితమైనదని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయంపై ట్వీట్ చేశారని అన్నారు.

“భారతదేశంలో, మీరు ఏదైనా గురించి మాట్లాడితే, మరొకరి సెంటిమెంట్ దెబ్బతింటుంది. కాబట్టి ఇది కొత్తేమీ కాదు. చరిత్రకారులను అడగడంతో పాటు అనేక పరిశీలనలు చేశాను. వాటినే రాశాను. , నేను చేసిన పోస్ట్‌లో చాలా చక్కటి భాషను ఉపయోగించాను. ఇప్పటికీ ఇది. తప్పు అని అనుకోవడం లేదు” అని సమర్థించుకున్నాడు ప్రొఫెసర్.

ప్రొఫెసర్ అరెస్ట్‌ను కాంగ్రెస్ నేత దిగివిజయ సింగ్ ఖండించారు.”ప్రొఫెసర్ రత్న్ లాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనకు రాజ్యాంగం ప్రకారం అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు.