AAP తాహిర్ హుస్సేన్ ఇంట్లో యాసిడ్ ప్యాకెట్లు

AAP తాహిర్ హుస్సేన్ ఇంట్లో యాసిడ్ ప్యాకెట్లు

Updated On : February 28, 2020 / 1:42 AM IST

బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీ నేత మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ ఈశాన్య ఢిల్లీ ఆందోళనల్లో కీలక పాత్ర వహించాడని ఆరోపించారు. ఇందులో భాగంగానే గురువారం తాహిర్ ఇంటిపై డజన్ల కొద్దీ యాసిడ్ పాకెట్లు దొరకడం సంచలనంగా మారాయి. గురువారం ఉదయమే అతని ఇంటిపైన పెట్రోల్ బాంబులు, రాళ్లు గుట్టలుగుట్టలుగా దొరికాయి. 

ఢిల్లీ పోలీసుల జాబితాలో ఇప్పటివరకూ ఆందోళనకారకుడని పేరెక్కని హుస్సేన్.. టెర్రస్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అతని సపోర్టర్లు రాళ్లు విసురుతూ, పెట్రోల్ బాంబులు వేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. తాహిర్ ఇంటి పక్కవారిపైనా దాడులు జరిగాయని వాళ్లు ఆరోపిస్తున్నారు. 

ఇంటలిజెన్స్ బ్యూరో అంకిత్ శర్మ మృతదేహం ఇంటి డ్రైనేజిలో దొరకడం కలకలం రేపింది. తాహిర్ హుస్సేన్ ఇంటిపై దాడులు చేసేవారే తన కొడుకుని చంపారంటూ అంకిత్ తండ్రి ఆరోపించారు. 

‘తాహిర్ హుస్సేన్‌యే హంతకుడు. అంకిత్ శర్మ ఇంకా నలుగురు వ్యక్తులు కలిసి బయటకు లాగి దాడి చేశారు. వైరల్ అవుతున్న వీడియోల్లో మాస్క్‌లు ధరించిన తాహిర్, మిగిలిన యువకులు, రాళ్లు, బుల్లెట్లు, పెట్రోల్ బాంబులతో హల్ చల్ చేసినట్లు స్పష్టంగా ఉందని కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ కపిల్ మిశ్రా ట్వీట్ చేశాడు.