Dense fog : ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలి…కమ్ముకున్న పొగమంచు

చలి గాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కప్పివేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉన్నందున ఉత్తర భారతదేశంలో చలి వాతావరణం కొనసాగుతుంది....

Dense fog : ఉత్తరభారతాన్ని వణికిస్తున్న చలి…కమ్ముకున్న పొగమంచు

Dense fog

Dense fog : చలి గాలులు ఉత్తర భారతాన్ని వణికిస్తున్నాయి. చలికి తోడు దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కప్పివేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉన్నందున ఉత్తర భారతదేశంలో చలి వాతావరణం కొనసాగుతుంది. తీవ్ర మైన చలి ప్రభావం వల్ల నోయిడాలోని పాఠశాలలను మూసివేశారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన విడుదల చేసిన వెదర్ బులెటిన్ తెలిపింది.

ALSO READ : జనసేన ప్లస్‌లు ఏంటి? మైనస్‌లు ఏవి?

ఢిల్లీ, హర్యానా, చండీగఢ్‌లలో డిసెంబర్ 31వతేదీ వరకు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. విమానాలు, రైల్వేలు, వాహనాల చోదకులు ఫాగ్ లైట్లు ఉపయోగించాలని వాతావరణశాఖ సలహా ఇచ్చింది. డిసెంబరు 30, 31 తేదీల్లో జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు.

ALSO READ : Vyooham : వివాదాల వ్యూహం.. ఆ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

చలిగాలుల ప్రభావం వల్ల వచ్చే జనవరి 4 వరకు ఉత్తర భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల పాటు ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఏడు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.ఢిల్లీలో పొగమంచు కారణంగా ఢిల్లీ నగరానికి వెళ్లే 22 రైళ్లు ఆలస్యంగా రావడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

ALSO READ : BRS MPS : కాంగ్రెస్‌తో టచ్‌లో ముగ్గురు ఎంపీలు? పోటీకి సిట్టింగ్‌ల విముఖత.. బీఆర్ఎస్‌‌కు కొత్త టెన్షన్

ఉత్తరప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించగా,మరో ఆరుగురు గాయపడ్డారు. ముజఫర్‌నగర్‌లోని మిరాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఉన్నావ్‌లో స్థిరంగా ఉన్న ట్రక్కును మోటార్‌సైకిల్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ALSO READ : CM Jagan : జగన్ దూకుడు.. ఒకేసారి 175 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన..‍!

అజంగఢ్‌ జిల్లాలోని అట్రౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలో చిక్కుకుపోయిన పికప్ వ్యాన్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా కనిపించని కారణంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్నారు.