Oxygen Cylinder: దానికి ఒప్పుకుంటే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేస్తా

కరోనా భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే సాయం చేద్దామని వచ్చిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడి తండ్రి ...

Oxygen Cylinder: దానికి ఒప్పుకుంటే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేస్తా

Oxygen Cylinders

Updated On : May 13, 2021 / 9:30 PM IST

Oxygen Cylinder: కరోనా భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుంటే సాయం చేద్దామని వచ్చిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడి తండ్రి కొవిడ్ బారిన పడ్డాడని ఆక్సిజన్ సిలిండర్ గురించి అందరూ ప్రయత్నిస్తుంటే తానూ ట్రై చేసింది. అవతల వ్యక్తి కూడా మానవత్వంతో ఆలోచిస్తాడనుకుని అడిగితే ఆ వ్యక్తి.. నీచమైన గుణాన్ని బయటపెట్టాడు.

ఈ ఘటన మొత్తాన్ని ఆ యువతి ట్విట్టర్ వేదికగా బయటపెట్టింది. ‘నా స్నేహితుడి తండ్రి కోవిడ్‌ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కావాల్సి వచ్చింది. చిన్నతనం నుంచి సోదరిగా భావించిన పొరుగింటి వ్యక్తిని పరిస్థితి వివరించి సాయం చేయమని అడిగా’

‘తప్పకుండా హెల్ప్ చేస్తా. బదులుగా నువ్వు నాతో ఆ పనికి ఒప్పుకోవాలి. అలా చేస్తే వెంటనే ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేస్తా’ అన్నాడట. ఊహించని పరిణామానికి షాక్‌ అయ్యింది యువతి. చిన్నతనం నుంచి చెల్లి అని పిలిచిన వ్యక్తి ఇంత నీచంగా ఆలోచిస్తున్నాడా అనుకుందట.

ఆ ఘటన మొత్తాన్ని ట్విట్టర్లో వివరించి.. ఇలాంటి వాడిని ఏం చేయాలో చెప్పమంటూ నెటిజన్స్ కు వదిలేసింది.

పోలీసులకు ఫిర్యాదు చేయండి, అపార్ట్‌మెంట్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లండి, పేరు – ఫోటో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయండి. పబ్లిక్‌గా పరువు తీస్తే తప్ప ఇలాంటి వారికి బుద్ధి రాదని కామెంట్‌ చేస్తున్నారు.