చిన్నారి కోసం ట్యాక్స్ మాఫీ, మోదీ సర్కార్ పై ప్రశంసలు..ఏమి జరిగింది

చిన్నారి కోసం ట్యాక్స్ మాఫీ, మోదీ సర్కార్ పై ప్రశంసలు..ఏమి జరిగింది

Updated On : February 11, 2021 / 5:40 PM IST

Devendra Fadnavis Thanks PM For Tax Relief On Medicines For Girl Child : ఐదు నెలల చిన్నారి..పుట్టుకతోనే అసాధారణ అనారోగ్య సమస్యతో బాధ పడుతోంది. భారతదేశంలో దొరకని ఆ మందు..విదేశాల్లో దొరుకుతుంది. ఇక్కడకు తేవాలంటే..భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఇందుకు భారతదేశంలో విధించిన ట్యాక్స్ తోడు కావడంతో ఆ ఖర్చు తడిసిమోపవుతుంది. దీంతో ఆ తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. పాప ప్రాణాలు కాపాడాలంటే..రూల్స్ మార్చాల్సి ఉంటుంది. మానవతాథృక్పథంతో స్పందించడంతో నెటిజన్లు మోడీ సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అసలు ఏమి జరిగింది ?
తీరా కామత్..ఐదు నెలల చిన్నారి..వెన్నెముక కండరాల బలహీనతతో బాధ పడుతోంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. స్పైనల్ మస్కుల్ర్ అట్రోఫి (SMA) అరుదైన వ్యాధి ఆ చిన్నారిని కబలించి వేసింది. చిన్నారి తల్లిదండ్రులు ప్రియాంక, మిహిర్ లకు ఏమి చేయాలో అర్థం కాలేదు. నయం చేసేందుకు అవసరమయ్యే మెడిసిన్స్ భారత్ లో లభ్యం కావు. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికా నుంచి రూ. 16 కోట్లు విలువ చేసే జోల్ జెన్ స్మా అనే ప్రత్యేక ఇంజక్షన్ తెప్పించాల్సి ఉంటుంది. జీవితాంతం కష్టపడినా..అంత డబ్బులు జమ చేయలేమని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు.

రూ. 12 కోట్ల నిధులు :-
ఐదు నెలల చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయారు. దాతలు విరాళాలు జల్లును కురిపించారు. ఏకంగా రూ. 12 కోట్ల నిధులు సమకూరాయి. అయినా..మెడిసిన్స్ సరిపడా డబ్బులు సమకూరలేదు. జీఎస్టీ విధిస్తే..పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దాతలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు, అమెరికా నుంచి దిగమతి చేసుకబోయే..మెడిసిన్స్ కు సుంకాలు ఉండడంతో భారీగా భారం పడుతోందని తెలిపారు. వివిధ రకాల పన్నులను మినహాయిస్తే…తన పాపకు చికిత్స అందుతుందని కోరారు.

దేవేంద్ర ఫడ్నవీస్ లేఖ :-

ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మెడిసిన్స్ విషయంలో దిగుమతి సుంకాన్ని, జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ కేంద్రానికి ఫిబ్రవరి 01వ తేదీన లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సానుకూలంగా నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విటర్ ఖాతాలో ఫిబ్రవరి 9వ తారీఖున పోస్ట్ చేశారు.

మోదీపై ప్రశంసలు :-
ఐదు నెలల పాపకు జరిగే చికిత్స కోసం కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్లు సీఎం ఫడ్నవీస్ ట్వీట్ లో తెలిపారు. పాపకు అవసరమయ్యే మెడిసిన్స్ కు సంబంధించి దిగుమతి పన్నును, జీఎస్టీని మినహాయించడమైనది. తెలిపారు. మొత్తంగా…ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు..నెటిజన్లు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.