ట్రంప్‌కి షాకిచ్చిన ఇండియా.. దెబ్బకు దెబ్బ.. సైలెంట్‌గా టారిఫ్ వేసేసింది..

India : గత ఏడాది అక్టోబర్ 30న అమెరికా పసుపు బఠానీలపై భారతదేశం 30శాతం సుంకం విధించిందని సెనెటర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు లేఖలో వివరించారు.

ట్రంప్‌కి షాకిచ్చిన ఇండియా.. దెబ్బకు దెబ్బ.. సైలెంట్‌గా టారిఫ్ వేసేసింది..

Modi Trump

Updated On : January 18, 2026 / 2:33 PM IST

India imposed a 30 percent tariff on US yellow peas : భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై అమెరికా సర్కార్ టారిఫ్‌ల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, భారత్ సైతం అదే స్థాయిలో ట్రంప్‌కు షాకిచ్చింది. ఈ క్రమంలో భారత సర్కార్ తన పనిని సైలెంట్ గా చేసుకెళ్తోంది.

Also Read : Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న నెపంతో భారత్ ఉత్పత్తులపై అమెరికా 50శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్ – అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ టారిఫ్‌ల ప్రకటన చేయడం అపట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తరువాత కూడా టారిఫ్‌లను పెంచుతామంటూ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. భారత్ మాత్రం సైలెంట్‌గా ప్రతిస్పందించిందని తెలుస్తోంది. అమెరికా పప్పు ధాన్యాలపై 30శాతం (10శాతం బేసిక్ డ్యూటీ + 20% అగ్రికల్చరల్ సెస్) సుంకాలను భారత్ విధించింది.

గత ఏడాది అక్టోబర్ 30న అమెరికా పసుపు బఠానీలపై భారతదేశం 30శాతం సుంకం విధించిందని సెనెటర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు లేఖలో వివరించారు. అ విషయం ఇప్పటి వరకు పెద్దగా బయట చర్చనీయాంశం కాలేదు. మోదీ సర్కార్ ఎలాంటి హడావుడి లేకుండా సుంకాలు పెంచేసి ట్రంప్‌నకు షాకిచ్చింది.

భారత్‌తో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో.. అమెరికన్‌ పప్పు ధాన్యాలకు మెరుగైన మార్కెట్‌ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని నార్త్ డకోటా సెనెటర్ కెవిన్ క్రామర్, మోంటనా సెనెటర్ స్టీవ్ డైనెస్‌లు డొనాల్డ్ ట్రంప్‌నకు లేఖ రాశారు.

బఠానీలు సహా ప్రపంచ దేశాల్లో భారత్‌ సుమారు 27శాతం పప్పు ధాన్యాలను వినియోగిస్తుందని ట్రంప్‌కు రాసిన లేఖలో తెలిపారు. శనగలు, కందిపప్పు, ఎండబెట్టిన చిక్కుళ్లు భారతీయులు ఎక్కువగా వాడుతున్నారు. పచ్చి బఠానీల దిగుమతిపై గతేడాది అక్టోబరు 30న భారత్‌ 30శాతం సుంకాలు విధించిందని, గతేడాది నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయని స్టీవ్‌ డైనీస్‌, కెవిన్‌ క్రామర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ అదనపు సుంకాల కారణంగా నాణ్యమైన పప్పులను అమెరికా రైతులు అధిక ధరలకు భారత్‌కు ఎగుమతి చేయాల్సి వస్తోందన్నారు. భారత్‌ ప్రధానితో జరిగే చర్చల్లో పప్పుల దిగుమతి సుంకాల విషయమై రెండు దేశాలకు పరస్పర ఆర్థిక సహకారం పెంపుదలతోపాటు పరస్పర ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ను కోరారు.