Bengal Governor : అంకుల్ జీ కామెంట్స్ కు బెంగాల్ గవర్నర్ స్ట్రాంగ్ కౌంటర్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Bengal Governor
Bengal Governor పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్ ను అంకుల్ జీ అని సంబోధిస్తూ..ఆదివారం నుంచి మహువా మోయిత్రా వరుస ట్వీట్లు చేస్తోంది. గవర్నర్.. రాజ్‌భవన్‌లో తన బంధువులు ఆరుగురికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారని,వాళ్లందరికీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పోస్టులు ఇచ్చారని మహువా ఆరోపించారు. వాళ్ల పేర్లతో కూడిన జాబితాను కూడా ఆమె ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.
అయితే తృణముల్ ఎంపీ ట్వీట్లపై బెంగాల్ గవర్నర్ స్పందించారు. బెంగాల్ రాజ్‌భవన్ మొత్తాన్ని గవర్నర్ కుటుంబీకులు, పరిచయస్తులతో నింపేశారన్న మహువా మొయిత్రి వ్యాఖ్యలను గవర్నర్ జగదీప్ ధన్‌కర్ కొట్టిపారేశారు. ఈ మేరకు సోమవారం గవర్నర్ ఓ ట్వీట్ చేశారు.
తృణముల్ నేత మహువా మొయిత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు. ఎంపీ ఆరోపిస్తున్న వారంతా మూడు రాష్ట్రాలకు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారు. వీరిలో ఏ ఒక్కరూ నా కుటుంబానికి సన్నిహితులు కారు. ఈ ఆరుగురికీ నా కులంతో కానీ, రాష్ట్రంతో కానీ సంబంధం లేదు. ప్రస్తుతం బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న వేళ ఈ పరిస్థితుల నుంచి దారి మళ్లించేందుకే తృణమూల్ కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నా బాధ్యతను నిర్వర్తిస్తాను అని గవర్నర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.