US Visa: యూఎస్ వీసా కోసం వియాత్నాం వెళ్లాల్సిందేనా..? హైదరాబాద్ విద్యార్థుల పాట్లు ..
భారత్‌లో యూఎస్ వీసాకోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో హైదరాబాద్‌కు చెందిన పలువురు విద్యార్థులు యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్ లెటర్లతో వీసాల కోసం ఇతర ఆసియా దేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా వీసాలు పొందడానికి వియాత్నం, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యూఎస్ వెళ్తున్నారు.

US visa
US Visa: భారత్ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారిలో యూఎస్‌కు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడి యూనివర్శిటీల్లో చదువుకోవాలని కొందరు, ఉద్యోగ రిత్యా, వ్యాపార రిత్యా మరికొందరు ఇలా నిత్యం యూఎస్ వెళ్లేవారి సంఖ్య భారతదేశం నుంచి ఎక్కువగానే ఉంటుంది. అయితే, వీరికి యూఎస్ వీసా రావాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇక్కడ యూఎస్ వీసా పొందాలంటే నెలల సమయం వేచిచూడాల్సి వస్తుంది. దీంతో వీసాకోసం చాలా మంది కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆసియా ఖండంలోని ఇతర దేశాలకు వెళ్లి యూఎస్ వీసా పొందుతున్నారు. ముఖ్యంగా వియాత్నాం వెళ్లి అక్కడి నుంచి యూఎస్ వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో హైదరాబాద్ విద్యార్థులు, వ్యాపారులు కూడా అధికంగానే ఉన్నారు.
Indians US Visa : అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్
భారత్‌లో యూఎస్ వీసాకోసం సుదీర్ఘ సమయం పడుతుండటంతో హైదరాబాద్‌కు చెందిన పలువురు విద్యార్థులు యూఎస్ యూనివర్శిటీల్లో అడ్మిషన్ లెటర్లతో వీసాల కోసం ఇతర ఆసియా దేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా వీసాలు పొందడానికి వియాత్నం, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యూఎస్ వెళ్తున్నారు. వీరిలో విద్యార్థులతో పాటు, వ్యాపార ప్రయాణీకులు ఉన్నారు. హైదరాబాద్ అనేక మంది ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోయలేదు.. హైదరాబాద్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో వీసాకోసం నెలల సమయం వేచి ఉండాల్సి వస్తుందని ఈ లోపు వీసా రాకుంటే యూఎస్ లో ఓ విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.
US Visa Wait Time For Indians: అమెరికా వీసాలు పొందాలంటే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిందే!
నాన్ – ఇమిగ్రెంట్ వీసాల కోసం వేచి ఉండే సమయంలో భారత్‌లో చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో ఎఫ్, ఎం, జే వీసాల కోసం 70 రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. అదే వియాత్నాంలో కేవలం ఆరు రోజుల్లోనే స్లాట్ లను పొందే అవకాశం ఉంటుంది. ఇక బ్యాంకాక్ లో సగటు సమయం నాలుగు రోజులుగా ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా బీ1, బీ2 వీసాలదీ అదే పరిస్థితి.. భారత్ లో 611 రోజుల నిరీక్షణ సమయం .. అదే వియత్నాంలో నెల రోజులు, బ్యాంకాక్ లో నాలుగు రోజులు సమయం మాత్రమే పడుతుండట. దీంతో నగరంలోని విదేశీ కన్సల్టెన్సీ సంస్థలు సైతం ఇటీవల ఈ విధానాన్నే ఎక్కువగా అవలంభిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇందుకోసం అదనంగా లక్ష వరకు ఖర్చు అవుతున్నప్పటికీ విద్యార్థులు వెనుకడుగు వేయడం లేదు. కారణం.. యూఎస్‌లో విద్యా సంవత్సరం మిస్ అవ్వకుండా వెళ్లేందుకు ఉపయోగపడుతుండటమే కారణం.