Holidays For Dussehra : ద‌స‌రా పండుగకు ఏయే రాష్ట్రాలు.. ఎన్ని రోజుల సెల‌వులు..!

సెలవులు అనగానే స్కూలు పిల్లలతోపాటు ఉద్యోగులకు సంతోష పడతారు. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్‌ హాలిడేస్‌ మహదానందాన్ని ఇస్తాయి. రానున్న దుర్గాపూజ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం 11 రోజుల పాటు ఆఫీసులకు సెలవులు ప్రకటించింది.

Holidays For Dussehra : ద‌స‌రా పండుగకు ఏయే రాష్ట్రాలు.. ఎన్ని రోజుల సెల‌వులు..!

Holidays For Dussehra

Updated On : August 28, 2022 / 5:50 PM IST

Holidays For Dussehra : సెలవులు అనగానే స్కూలు పిల్లలతోపాటు ఉద్యోగులకు సంతోష పడతారు. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్‌ హాలిడేస్‌ మహదానందాన్ని ఇస్తాయి. రానున్న దుర్గాపూజ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం 11 రోజుల పాటు ఆఫీసులకు సెలవులు ప్రకటించింది.

సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 వరకు సెలవులు ఇచ్చింది. అంతేకాకుండా, మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో 22 రోజులు సెలవులు తీసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సెలవుల సంఖ్య గతేడాది 16గా ఉంది. ఈ నేపథ్యంలో దసరా పండగకు దేశంలో ఏయే రాష్ట్రాలు ఎన్ని సెలవులు ఇస్తున్నాయో చూద్దాం.

Bastar Dussehra :శ్రీరాముడు వనవాసం చేసిన దండకారణ్యంలో దసరా..విశేషాలు ఎన్నెన్నో

దేశంలో అతి తక్కువ పబ్లిక్‌ హాలిడేస్‌ ఉన్న రాష్ట్రం ఢిల్లీ (14 రోజులు) కాగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్‌ (15) నిలిచింది. తర్వాత కర్ణాటక (16) ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సెలవుల సంఖ్య 28 రోజులుగా ఉంది. అత్యధికంగా సెలవులు కలిగిన రాష్ట్రంగా ఒడిశా (34 రోజులు) నిలిచింది. తర్వాతి స్థానంలో జార్ఖండ్‌ (33), అసోం (32), హిమాచల్‌ ప్రదేశ్‌ (32)లు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో 28 ఉండగా, ఇప్పుడు దీనికి అదనంంగా 22 రోజులు ఇవ్వనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలిన 24 రాష్ట్రాల సగటు సెలవుల సంఖ్య 25 రోజులుగా ఉంది. వీటిలో 20 రోజుల కన్నా తక్కువ రోజులు సెలవులు ఉన్న రాష్ట్రాలు ఐదు ఉన్నాయి. అంటే కొన్ని జాతీయ సెలవులు మినహా ఆయా ప్రాంతాల ఆచారాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు నిర్ణయిస్తున్నాయి.