Bastar Dussehra :శ్రీరాముడు వనవాసం చేసిన దండకారణ్యంలో దసరా..విశేషాలు ఎన్నెన్నో

శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేసిన దండకారణ్యంలో దసరా వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆదివాసీలు జరుపుకునే ఈ వేడుకలకు రాజకుటుంబాలవారు కూడా వచ్చి పాల్గొంటారు.

Bastar Dussehra :శ్రీరాముడు వనవాసం చేసిన దండకారణ్యంలో దసరా..విశేషాలు ఎన్నెన్నో

Bastar Dussehra Celebration (1)

Bastar Dussehra Celebration in Chhattisgarh : దసరా పండుగ అంటే అమ్మవారి పండుగ. శరన్నవరాత్రులు అమ్మవారికిని రకరకాల అవతారాల్లో కొలుచుకుంటాం. కానీ దసరా వేడుకల్లో శ్రీరాముడి ప్రస్తావన ఏంటీ అనేది ఆసక్తికర విషయం. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌లో అడవి బిడ్డలు ఆదివాసీలు చేసుకునే దసరా వేడుకల్లో శ్రీరాముడు ప్రస్తావన ఉంటుంది. ఇక్కడి ఆదివాసీలు దసరాకు దాదాపు నాలుగు నెలల ముందే ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. అంత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివాసీలు దసరాకు 75 రోజుల ముందే ప్రారంభిస్తారు. ఈ ఆదివాసీలు రాముడు తమ ప్రాంతానికి వచ్చాడని..ఇక్కడే 14 సంవత్సరాలు వనవాసం చేశారని నమ్ముతారు. అంతేకాదు రాముడు మా అతిథి..మేం ఎంతో పుణ్యం చేసుకున్నాం..అందుకే శ్రీరాముడులాంటి మనోన్నతుడికి అతిథ్యం ఇచ్చామని చెబుతారు.

Read more : Dasara 2021 : జోగులాంబలో శరన్నవరాత్రి వేడుకలు

రాముడు వనవాసం చేసిన దండకారణ్యంలో ఆదివాసీల దసరా వేడుకలు..
పచ్చదనం మధ్య దసరాను అడవి బిడ్డలు ఆనందడోలికలలో తేలిపోతే వేడుకల్ని జరుపుకుంటారు. ఆదివాసీల సంప్రదాయంలో సంగీత వాయిద్యాలతో సంప్రదాయపు ఎర్రని వస్త్రధారణతో చేసుకునే ఈ దసరా వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. దసరా పండుగ అంటే మనకు తొమ్మిది రోజుల పండుగ. కానీ చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌లో దసరా రెండున్నర నెలల పండగ. విజయదశమికి 75 ముందే మొదలవుతుంది.

ఈ దండకారణ్య వేడుకలో ఆదివాసీలు ఆనందంగా పాల్గొంటారు. ఆదివాసీలు ఈ దసరా పండగకు దంతేశ్వరీ దేవిని పూజిస్తారు. రాముడిని తమ అతిథిగా భావిస్తారు. పద్నాలుగేళ్ల వనవాసం చేసింది తమ దగ్గరే అని చెబుతారు. జాతికులమతాల పరిధులేవీ లేని ఈ వేడులకు అంత్యం ఆబంరంగా జరుగుతాయి. ఈ వేడుకలో రథయాత్ర కోసం ఏటా అడవిలో కలపను సేకరించి ఎనిమిది చక్రాలతో కొత్త రథాన్ని తయారు చేస్తారు ఆదివాసీలు. ఈ దసరా వేడుకల్లో రథం కోసం కలప సేకరణ ఈ వేడుకలో తొలి ఘట్టం. ఆ వేడుకను వారు పత్‌ జాతర అంటారు.పదవ రోజు మురియా దర్బార్‌తో వేడుకలు ముగుస్తాయి. దర్బారు అంటే ప్రజలు తమ సమస్యలను రాజుకు విన్నవించుకోవటం.

Read more : Dasara Festivals : శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

భాగస్వామిని ఎంచుకునే వేడుక ఘోతుల్..
బస్తర్‌ దసరా వేడుకల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఘోతుల్‌ గురించి. ఈ వేడుక పూర్తిగా యువతీయువకులదేనని చెప్పాలి. యువతీయువకులకు తమ భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పించే వేడుక ఘోతుల్. గుజరాత్‌ నవరాత్రి వేడుకలో గర్భా నాట్యంలాంటిదే ఈ ఘోతుల్ వేడుక. దసరా వేడుకల సమయంలో బస్తర్‌ యాత్రకు వెళ్తే ఆదివాసీ తమ సంప్రదాయ సంగీతవాద్యాలతో ఆనంద డోలికల్లో తేలిపోతుంటారు. వారి నాట్యం చూసి తీరవలసిందే. వస్త్రధారణ ముఖ్యంగా మహిళలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర రంగు వస్త్రాలు ధరిస్తారు. దీంతో వేడుక అంతా ఎర్రని రంగుతో నిండిపోయి కనువిందు చేస్తుంది. ప్రభుత్వం నిర్వహించే వేడుకలో రాజకుటుంబ వారసులు కూడా పాల్గొంటారు.