Madhya Pradesh : మహిళ కడుపులో 15 కిలోల కణితి .. సర్జరీ చేసి తొలగించిన 12మంది డాక్టర్లు

ఆమె బరువు 49 కేజీలు. కానీ ఆమె కడుపులో పెరిగిన కణితి బరువు 15కిలోలు. 12మంది డాక్టర్లు కష్టపడి ఆమె ప్రాణాలు కాపాడారు.

Madhya Pradesh : మహిళ కడుపులో 15 కిలోల కణితి .. సర్జరీ చేసి తొలగించిన 12మంది డాక్టర్లు

Fifteen kgs tumor from a woman stomach

Updated On : August 9, 2023 / 3:59 PM IST

Fifteen kgs tumor from a woman stomach : ఓ మహిళ కడుపులోంచి ఏకంగా 15 కిలోల బరువున్న కణితిని ఆపరేషన్ చేసి తొలగించారు డాక్టర్లు. దాదాపు మూడు గంటలపాటు 12మంది డాక్టర్లు శ్రమించి అత్యంత జాగ్రత్తగా ఆమె కడుపులో కణితిని తొలగించి విజయవంతంగా ఆపరేషన్ ను పూర్తి చేశారు. మరికొన్ని రోజులు ఆ కణితి ఆమె కడుపులో ఉంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం జరిగేదని ఎందుకంటే ఆ కణితి పగిలిపోయే దశలో ఉందని దీంతో సర్జరీ చేయటానికి డాక్టర్ల బృందం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ డాక్ట‌ర్లు.

10 years Girl Marriage : పెళ్లి చేయమంటూ 10 ఏళ్ల చిన్నారి మారాం, చేసిన 12 రోజులకే మృతి .. వింత కోరిక వెనుక పెను విషాదం

41 ఏళ్ల మ‌హిళ తీవ్రమైన క‌డుపు నొప్పితో ఇండెక్స్ ఆస్ప‌త్రిలో చేరింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు స్కానింగ్ వంటి పరీక్షలు చేసి కడుపులో భారీ కణితి ఉందని అది పగిలిపోయే దశలో ఉందని వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. దీంతో సదరు మహిళ కుటుంబ సభ్యులు అంగీకరించటంతో డాక్టర్ అతుల్ వ్యాస్ నేతృత్వంలో 12మంది డాక్టర్ల బృందం సర్జరీలో పాల్గొంది. దాదాపు మూడు గంటలపాటు సర్జీరీ చేసిన కణితిని తొలగించారు. దీంతో సర్జరీ విజయవంతమైంది.

ఆ మ‌హిళ బరువు 49 కేజీలు ఉంటే దాంట్లో కణితి బరువే 15కిలోలు ఉందని తెలిపారు. ఆమె న‌డుస్తున్న‌ప్పుడు, తింటున్న స‌మ‌యంలోను, పడుకున్న సమయాల్లో క‌ణితి వ‌ల్ల చాలా ఇబ్బందులు పడేదని తెలిపారు. ఆ క‌ణతి వ‌ల్ల కడుపులో వాపు వ‌చ్చింద‌ని, అయితే అది ప‌గ‌ల‌లేద‌ని, లేదంటే ఆమె ప్రాణాల‌కు ముప్పు ఉండేద‌న్నారు. క‌డుపులో క‌ణ‌తిని ఓవేరియ‌న్ ట్యూమ‌ర్‌గా ఇండెక్స్ డాక్ట‌ర్లు గుర్తించారు.