కిడ్నీ సమస్యలతో ఉన్న కుక్కకు రక్తదానం చేసిన మరో కుక్క

మనిషికి రక్తం అవసరం వచ్చినప్పుడు సాటి మనుషులు రక్తదానం చేయటం గురించి తరచు వింటుంటాం. కానీ అనారోగ్యంతో బాధపడే ఓ కుక్కకు మరో కుక్క రక్తం చేయటం గురించి బహుశా వినిఉండం. కానీ పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తాలో ఇది జరిగింది. కిడ్నీ సమస్యలతో బాధపడే ఓ కుక్కకు రక్తం అవసరం పడింది. దీంతో మరో కుక్క రక్తదానం చేసి ఆ కుక్కను కాపాడింది. సూపర్ హీరో అనిపించుకుంది.
వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన డానీ అనే 13 ఏళ్ల పెంపుడు కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. దీంతో డానీ యజమానులు ట్రీట్ మెంట్ కోసం డానీని కోల్‌కత్తాకు తీసుకొచ్చారు. దానికి రక్తం అవసరం పడింది. నటుడు అనింద్య చటర్జీకి చెందిన సియా అనే కుక్క డానీకి రక్తదానం చేసింది.
సియా సకాలంలో రక్త దానం చేయడంతో డాక్టర్లు డానీ ప్రాణాల్ని కాపాడగలిగారు.
ఈ అరుదైన రక్తదానం గురించి వెటర్నరీ డాక్టర్ దేబాజిత్ రాయ్ మాట్లాడుతూ…డానీ కొంతకాలం నుంచి కిడ్నీ సమస్యలతో సమస్యతో బాధపడుతుంది. దానికి ట్రీట్ మెంట్ చేయాలంటే రక్తం కావాల్సివచ్చింది. కుక్కలకు రక్త దానంపై సమాజంలో సరైన అవగాహనలేదు. దీంతో రక్తదాతలు దొరకని పరిస్థితి ఎదురైంది.
కోల్‌కతాలో ఇటువంటి ట్రీట్ మెంట్ కూడా కొత్తగా జరుగుతోంది.
కానీ, డానీకి రక్తదాత లభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాంమని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న నటుడు అనింద్య చటర్జీ Labrador జాతికి చెందిన తన కుక్క సియాను రక్తదానం కోసం తీసుకొచ్చారు.
ఆయన పెంపుడు కుక్క ‘సియా చాలా తెలివైంది. రక్తదానం చేసినప్పుడు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. కుదురుగా రక్తదానం అంటే తనకు తెలిసినట్లుగా చాలా తెలివిగా కదలకుండా రక్తదానం చేసిందని ప్రశంసించారు. ఎటువంటి ఇబ్బంది పడకుండా కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే తీసుకుని రక్తదానం చేసిందని తెలిపారు.
తన కుక్క సియా వల్ల మరో కుక్కకు ప్రాణం కాపాడినందుకు నా సియాను చూసి నాకు చాలా గర్వంగా ఉందనీ..సియా డానీని కాపాడేందుకు చక్కటి సహాయం చేసిందని నటుడు అనింద్య సంతోషం వ్యక్తంచేశారు.
కుక్కలకు విశ్వాసం ఎక్కువగా ఉంటుందని ఎన్నో సందర్భాల్లో రుజువైంది.పెంపుడు కుక్కలు తమ యజమానులు కష్టంలో ఉంటే అర్థం చేసుకుంటాయి.వారి ముఖాల్లో బాధను కూడా గురిస్తాయి. తమ యజమానులు మరణిస్తే ఎన్నో రోజులు రోదిస్తాయి. నిద్రాహారాలు మానేసి వారి కోసం ఎదురు చూస్తుంటాయి. తాజాగా కుక్కలకు ఉండే మంచితనం మరోసారి రుజువైంది.