Dog Missing : తప్పిపోయిన శునకం.. ఆచూకీ చెబితే రూ.5వేలు

కొందరు పెంపుడు జతువులను చాలా ఇష్టపడుతుంటారు.. తమ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అది కనిపించకపోతే కంగారు పడతారు. దానికోసం ఊరంతా గాలిస్తారు. తమ పెంపుడు జంతువు దొరికే వరకు వారికి మనశాంతి ఉండదు. అయితే తాజాగా తమ పెంపుడు శునకం తప్పిపోవడంతో ఓ కుటుంబం దాని కోసం తీవ్రంగా గాలిస్తుంది.

Dog Missing : తప్పిపోయిన శునకం.. ఆచూకీ చెబితే రూ.5వేలు

Dog Missing

Updated On : July 16, 2021 / 9:10 AM IST

Dog Missing :  కొందరు పెంపుడు జతువులను చాలా ఇష్టపడుతుంటారు.. తమ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అది కనిపించకపోతే కంగారు పడతారు. దానికోసం ఊరంతా గాలిస్తారు. తమ పెంపుడు జంతువు దొరికే వరకు వారికి మనశాంతి ఉండదు. అయితే తాజాగా తమ పెంపుడు శునకం తప్పిపోవడంతో ఓ కుటుంబం దాని కోసం తీవ్రంగా గాలిస్తుంది. కనిపించకుండా పోయిన తన పెంపుడు కుక్క పిల్ల ఆచూకీ తెలియచేసిన వారికి బహుమతి ప్రకటించాడు దాని యజమాని.

తన పెంపుడు శునకం జాడ తెలిసిన వరకు కింది నంబర్లకు ఫోన్ చెయ్యాలంటూ చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు కూడా అంటించాడు. తమిళనాడు శివగంగై జిల్లా, మదగుపట్టి తూర్పు వీధికి చెందిన రైతు వైరవన్‌.. అతడు జల్లికట్టు ఎద్దులను పెంచుతుంటాడు. పెంపుడు జంతువులంటే అమితమైన ఆసక్తి.. ఈ నేపథ్యంలోనే నెల క్రితం రామనాథపురం జిల్లా కముది నుంచి ఒక కుక్క పిల్లను తెచ్చుకున్నాడు. ఇది ఆ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన రాజపాళయం జాతికి చెందింది. ఈ శునకం మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయింది.

పెంపుడు శునకం కనిపించకపోవడంతో నిద్రాహారాలు మాని దాని రాకకోసం వేచిచూస్తున్నారు వైరవన్.. ఇక ఈ నేపథ్యంలోనే దాని ఆచూకీ తెలిపిన వారికి రూ.5,000 బహుమతి ప్రకటించాడు. మదగుపట్టి, బాగనేరి, సొక్కనాథపురం ప్రాంతాలలో పోస్టర్లు అంటించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పోస్టర్లు చూసిన జనం వెతికేందుకు సిద్ధమయ్యారు.

కుటుంబ సభ్యులు ఆ శునకం కోసం చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికారు. జాతి శునకం కావడంతో ఎవరైన అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైరవన్ కుటుంబ సభ్యులు