Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు

మే నెలలో రెండో సారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. 14.2 కిలోల గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.3.5 పెంచారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది.

Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు

Cylinder

Updated On : September 27, 2022 / 4:57 PM IST

Gas Cylinder Price : ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరల పెరుగుదలతో సతమవుతున్న ప్రజలపై మరో భారం పడింది. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై గుది బండ వేసింది. గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పై రూ.3.50 పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.8 పెంచారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి. భారత్ లో గ్యాస్ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దేశ వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.1000 దాటాయి.

మే నెలలో రెండో సారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. 14.2 కిలోల గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.3.5 పెంచారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.8 పెరిగింది. ఇటీవలే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజాగా మరోసారి కమర్షియల్ గ్యాస్ ధర పెంచారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులపై భారాలు పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.200, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.750 పైగా పెరిగింది.

Gas Cylinder Price: సామాన్యుడిపై మరోభారం.. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నాయి.
గృహ అవసర గ్యాస్ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.1003, ముంబైలో రూ.1002.50, కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.50కు చేరాయి. మే1వ తేదీన 100 రూ. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర.. మే 7న సిలిండర్ ధర 50 రూ. పెరిగింది. ఏడాది కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది.

ప్రస్తుతం ఢిల్లీలో రూ.2354, కోల్‌కతాలో రూ.2454, ముంబైలో రూ.2306, చెన్నైలో రూ.2507.  ఈ పెరుగుదల సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొద్ది రోజులుగా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనేవున్నాయి. ఇటీవల నిత్యవసరాల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. మార్కెట్లో కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి. దీనికి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ప్రజలపై పెను భారం పడనుంది.